ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair Tips: జుట్టు సమస్యలు తెగ వేధిస్తున్నాయా..? అరటిపండులో వీటిని కలిపి జుట్టుకు రాసుకుంటే..!

ABN, First Publish Date - 2023-07-21T11:17:09+05:30

ఈ హెయిర్ మాస్క్‌ను సాఫ్ట్, సిల్కీ హెయిర్ కోసం కూడా అప్లై చేయవచ్చు.

soft and shiny.

జుట్టు మృదువుగా ఉండాలంటే.. ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటాం. నిజానికి ఇంటి రెమిడీస్‌తో చేసే పోషణ జట్టుకు ఎప్పుడూ మంచిదే. పెరుగుతున్న కాలుష్యం నుంచి జుట్టును కాపాడుకోవడానికి సహజమైన విధానంలో ఇంటి చిట్కాలలో కాస్త సిల్కీగా ఉండేందుకు గోరింటాకు, ఉసిరి కలిపి వేస్తుంటారు.. వీటితో పాటు పండ్లను కూడా వాడచ్చు. అదెలాగంటే..

జుట్టు సహజంగా మృదువుగా సిల్కీగా ఉండే స్త్రీలు చాలా తక్కువ. సిల్కీ హెయిర్ కావాలంటే, హెయిర్ స్పా, కెరాటిన్ ట్రీట్‌మెంట్, స్మూత్ చేయడం ద్వారా జుట్టును మృదువుగా మార్చే ప్రయత్నం చేస్తారు, కానీ దీనికోసం ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి సెలూన్ లకు వెళ్లి మనీ డబ్బులు వదిలించుకుంటారు. దీనికి అరటిపండుతో చక్కని చిట్కా ప్రయత్నిస్తే సరిపోతుంది. అరటిపండును జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, మృదువుగా, మెరిసేలా చేయడానికి ఈ హెయిర్ మాస్క్ సరిపోతుంది.

బనానా హెయిర్ మాస్క్..

మృదువైన జుట్టు కోసం అరటి హెయిర్ మాస్క్ అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీని ప్రయోజనాలు ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా బలాన్నిస్తాయి. బనానా హెయిర్ మాస్క్‌ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు పోతుంది, తలకు తేమ అందుతుంది. జుట్టు మృదువుగా మారుతుంది. అరటిపండు నుండి హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

అరటి, గుడ్డు

అరటిపండు, గుడ్డు ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు బాగా పనిచేస్తుంది. హెయిర్ మాస్క్ చేయడానికి రెండు గుడ్లు, అరటిపండు వేసి గుజ్జు చేసుకోవాలి. దీనిని జుట్టుకు అప్లై చేసి అరగంట పాటు ఉంచి ఆ తర్వాత తలను కడిగేసుకోవాలి. అయితే అరటి పండు వెంట్రుకలను వదిలి రావడం కాస్త కష్టంగా ఉంటుంది కానీ తల ఆరిన తరువాత నెమ్మదిగా జుట్టును దువ్వడం వల్ల పోతుంది. మరునాడు కొద్దిగా షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు అందంగా, సిల్కీగా మారుతుంది.


ఇది కూడా చదవండి: పాలిచ్చే తల్లులూ.. పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను తినొద్దు.. ఎంత ఇష్టమైన కర్రీలైనా సరే..!

అరటిపండు, కొబ్బరి నూనె

అరటిపండుతో పాటు కొబ్బరినూనెను జుట్టుకు రాసుకుంటే జుట్టుకు పట్టదు. ఈ హెయిర్ మాస్క్ చేయడానికి, అరటిపండులో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె వేసి, సిద్ధం చేసిన హెయిర్ మాస్క్‌ను జుట్టుపై 20 నుండి 25 నిమిషాల పాటు ఉంచిన తర్వాత తల కడగాలి. జుట్టు మృదువుగా మారుతుంది.

అరటిపండు, తేనె

ఈ హెయిర్ మాస్క్‌ను సాఫ్ట్, సిల్కీ హెయిర్ కోసం కూడా అప్లై చేయవచ్చు. ఈ హెయిర్ మాస్క్ చేయడానికి, అరటిపండును మెత్తగా చేసి, దానికి 2 చెంచాల తేనె కలపండి. దీన్ని తలకు పట్టించి మిగిలిన భాగాన్ని జుట్టు చివర్ల వరకు రుద్దండి. జుట్టును పైకి కట్టి, కాసేపు అలాగే ఉంచి, 20 నిమిషాల తర్వాత తల కడగాలి. ఈ అరటి పండు చిట్కాలు జుట్టుకు బలాన్ని ఇచ్చి, మృదువుగా చేస్తాయి.

Updated Date - 2023-07-21T11:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising