ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kidney Stones: బీర్లు తాగితే కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయా? అసలు నిజమేంటి? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

ABN, First Publish Date - 2023-09-17T11:25:08+05:30

ప్రస్తుతం మన దేశంలో కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా కిడ్నీలో స్టోన్స్‌కు బీర్లు తాగడం మంచి పరిష్కారం అని కూడా చాలా మంది నమ్ముతున్నారు.

ప్రస్తుతం మన దేశంలో కిడ్నీలో రాళ్లతో (Kidney Stones) బాధపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా కిడ్నీలో స్టోన్స్‌కు బీర్లు (Beer) తాగడం మంచి పరిష్కారం అని కూడా చాలా మంది నమ్ముతున్నారు. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ వాదనను నమ్ముతున్నట్టు ఓ సర్వే తేల్చింది. అయితే అసలు నిజమేంటి? బీర్లు తాగితే నిజంగానే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? (Food and Health)

బీర్లు తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి ఉంటుందని, ఆ క్రమంలో కిడ్నీలోని (Kidney Health) రాళ్లు కూడా బయటకు వెళ్లిపోతాయని కొందరు బలంగా నమ్ముతున్నారు. అయితే అది కేవలం అపోహ మాత్రమేనని పరిశోధకులు కొట్టి పారేస్తున్నారు. కిడ్నీలో 3 మి.మీ. కంటే తక్కువ పరిమాణం ఉన్న వల్ల రాళ్లు ఏర్పడితే అవి మూత్ర విసర్జన సమయంలో వాటంతట అవే బయటకు వచ్చేస్తాయి. దానికీ, బీర్‌కు ఎటువంటి సంబంధం లేదు. అంతకంటే పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లు ఏర్పడితే మాత్రం వాటంతట అవే బయటకు రావు (Health Tips).

Viral Video: వార్నీ.. విమానాశ్రయంలో ఇలా కూడా జరుగుతుందా? లగేజ్ తనిఖీ చేస్తూ డబ్బు కొట్టేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది!

నిజానికి బీరు తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై కిడ్నీ సమస్యలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండడానికి పాటించాల్సిన మంచి చిట్కా నీళ్లు (Water) ఎక్కువగా తాగడమే. అలాగే బీన్స్, తాజా కూరగాయలు, దానిమ్మ వంటివి తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు తగ్గే అవకాశం ఉంది. ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే మధుమేహం (Diabetes), రక్తపోటును (Hypertension) ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. కిడ్నీలో రాళ్లు పెరగడానికి ప్రధాన కారణాలు బీపీ, డయాబెటిస్ వంటి లైఫ్‌స్టైల్ రోగాలే అని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2023-09-17T14:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising