West Bengal: బంకురాలో ఢీకొన్న 2 గూడ్స్ రైళ్లు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
ABN, First Publish Date - 2023-06-25T09:24:03+05:30
పశ్చిమబెంగాల్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఒండా రైల్వే స్టేషన్స మీపంలో ఆదివారం తెల్లవారు రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి
బంకూరా: పశ్చిమబెంగాల్‌లో(West Bengal) రైలు ప్రమాదం జరిగింది. ఒండా రైల్వే స్టేషన్(Onda Railway Station) సమీపంలో ఆదివారం తెల్లవారు రెండు గూడ్స్ రైళ్లు(Two Goods) ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలు మెయిన్‌లైన్‌కు(Main Line ) బదులుగా లూప్ లైన్‌లోకి(Loop Line) ప్రవేశించి ట్రాక్‌పై ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాద ఘటనను మరువకముందే అదే తరహాలో గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. దీంతో ఖరక్‌పూర్-బంకూరా-ఆద్రా లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేయబడ్డాయి.
ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. తెల్లవారు జామున 4 గంటలకు ప్రమాదం జరిగిందని లూప్‌లైన్‌లో ఉన్న గూడ్ రైలును మరో గూడ్స్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ లూప్‌లైన్‌లో గూడ్స్ దూసుకెళ్లి ఆగివున్న గూడ్స్‌ను ఢీకొట్టిందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా పైభాగంలోని విద్యుత్ వైరు తెగిపోయింది. దీంతో ఆద్రా-ఖరగ్‌పూర్ బ్రాంచ్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
బంకూరా రైలు ప్రమాదం కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేయబడ్డాయి. పురూలియా-హౌరా, అసన్సోల్-దిఘా, అద్రా-ఖర్గ్‌పూర్ ప్యాసింజర్, బిష్ణుపూర్-ఆద్రా ప్యాసింజర్, బిష్ణుపూర్-ధన్‌బాద్, ఖరగ్‌పూర్-అసన్‌సోల్, సంత్రాగచ్చి-పురూలియా ఎక్స్‌ప్రెస్, ఖరగ్‌పూర్-హతియా ఎక్స్‌ప్రెస్, గోమో-ఖార్గ్‌పూర్, అద్రా-అసన్‌సోల్, టాటా మేముతోపాటు ఆనంద్‌బెహర్ టెర్మినల్-పూరీ ఎక్స్‌ప్రెస్‌ను అద్రా-టాటా-హటియా లైన్‌గా పోర్‌బందర్-సంత్రగచ్చి ఎక్స్‌ప్రెస్‌ను పురూలియా-టాటా-ఖార్గ్‌పూర్ లైన్‌గా మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంతో 14 రైళ్లను ఆదివారం రద్దు చేసినట్లు ఆగ్నేయ రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశామని.. కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది.
Updated Date - 2023-06-25T11:53:09+05:30 IST