BREAKING: నేపాల్ దేశంలో రెండు సార్లు భూకంపం...భయాందోళనల్లో జనం
ABN, First Publish Date - 2023-04-28T07:31:39+05:30
నేపాల్ దేశంలో గురువారం రాత్రి రెండు సార్లు భూకంపం సంభవించింది...
Two Earthquakes
ఖాట్మండు(నేపాల్): నేపాల్ దేశంలో గురువారం రాత్రి రెండు సార్లు భూకంపం సంభవించింది.(Two Earthquakes) నేపాల్ దేశంలోని బజురా దహకోట్ ప్రాంతంలో(Nepal overnight) సంభవించిన భూకంపాలు రిక్టర్ స్కేలుపై 5.9, 4.8గా నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Center for Seismology) వెల్లడించింది.అర్ధరాత్రి రెండు సార్లు భూకంపం సంభవించడంతో ఇళ్లలో నిద్రపోతున్న ప్రజలు బయటకు పరుగులు తీశారు.రాత్రివేళ వరుస భూకంపాలు సంభవించడంతో జనం కలవరపడ్డారు. గతంలో నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించడంతో భూమి కంపించినపుడల్లా నేపాల్ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. గత భూకంపంలో ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా జరిగింది.
Updated Date - 2023-04-28T07:31:39+05:30 IST