ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Migrant Workers Attack: తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై కేసు

ABN, First Publish Date - 2023-03-05T14:32:53+05:30

బీహార్ వలస కార్మికులపై దాడి వివాదం తమిళనాడులో వేడెక్కుతోంది. ఉద్దేశపూర్వకంగానే కొందరు తప్పుడు ప్రచారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై: బీహార్ వలస కార్మికులపై దాడి (Migrant Workers Attack) వివాదం తమిళనాడులో వేడెక్కుతోంది. ఉద్దేశపూర్వకంగానే కొందరు తప్పుడు ప్రచారం సాగిస్తూ, నకిలీ వీడియోలు పోస్ట్ చేశారని తమిళనాడు పోలీసులు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (K.Annamalai)పై ఆదివారంనాడు కేసు నమోదు చేశారు. అన్నామలైపై సీసీబీ సైబర్ క్రైమ్ డివిజన్ కేసు నమోదు చేసినట్టు చెన్నై పోలీసులు చెప్పారు. ఐపీసీ సెక్షన్ 153, 153ఏ(1), 505(1)(b), 505(1)(c) కింద ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 'బీజేపీ బీహార్' ట్విట్టర్ అకౌంట్ హోల్డర్‌పై కూడా ఇవే సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అన్నారు.

24 గంటలు టైమిస్తున్నా...అరెస్టు చేయండి: అన్నామలై

కాగా, తనపై ఎఫ్ఐఅర్‌ నమోదు చేయడంపై అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్టాలిన్ ప్రభుత్వానికి 24 గంటలు సమయమిస్తున్నానని, తనను అరెస్టు చేసుకోవచ్చని అన్నారు. ''ఉత్తరాది సోదరులపై ఏడు దశాబ్దాలుగా వారు చేస్తున్న ప్రచారాన్ని బహిర్గతం చేసినందుకే నాపై డీఎంకే ప్రభుత్వం కేసు పెట్టింది. ఆ విషయాన్ని నేను అర్ధం చేసుకోగలను. వారు ఏమి మాట్లాడారో ఆ వీడియోను మీ ముందుంచుతున్నాను. దానినే నేను నా ప్రెస్‌మీట్‌లో చెప్పాను. తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యం గొంతు నులమాలని వారు (డీఎంకే) అనుకుంటున్నారు. ఒక సాధారణ వ్యక్తిగా మీకు నేను 24 గంటలు సమయం ఇస్తున్నారు. సాధ్యమైతే నా చేతులకు బేడీలు వేయండి. నన్ను అరెస్టు చేయాలని ఫాసిస్ట్ డీఎంకేను సవాలు చేస్తున్నా'' అని అన్నామలై ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు ఒక వీడియోను కూడా జత చేశారు.

కాగా, వలస కార్మికులపై దాడుల ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర పోలీసులు, తిరుప్పూరు జిల్లా అధికారులు ఆదివారంనాడు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వాణిజ్య, వ్యాపార సంఘాల ప్రతినిధులు, వలస కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T14:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising