ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP mimcking Dhankhar: విపక్షాల మాక్ పార్లమెంటు.. ఉపరాష్ట్రపతిపై పేరడీ..

ABN, Publish Date - Dec 19 , 2023 | 04:04 PM

పార్లమెంటు చరిత్రలోనే 144 మంది ఎంపీలపై ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడటంతో విపక్ష ఎంపీలు మంగళవారంనాడు నిరసనకు దిగారు. కొత్త పార్లమెంటు భవనం మకర్ ద్వార్ వెలుపల మెట్లపై 'మాక్ పార్లమెంటు' నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మరో అడుగు ముందుకు వేసి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్‌పర్సన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ను అనుకరిస్తూ 'పేరడీ' చేశారు. దీనిని రాహుల్ షూట్ చేశారు.

న్యూఢిల్లీ: పార్లమెంటు చరిత్రలోనే 144 మంది ఎంపీలపై ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడటంతో విపక్ష ఎంపీలు మంగళవారంనాడు నిరసనకు దిగారు. కొత్త పార్లమెంటు భవనం మకర్ ద్వార్ వెలుపల మెట్లపై 'మాక్ పార్లమెంటు' నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) మరో అడుగు ముందుకు వేసి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్‌పర్సన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar)ను అనుకరిస్తూ 'పేరడీ' చేశారు. సభ్యులు నవ్వులతో ఘొల్లుమనడం, రాహుల్ గాంధీ తన మొబైల్ కెమెరాలో దానిని షూట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.


ఇది పద్ధతి కాదు..

కాగా, మాక్ పార్లమెంటులో ఎంపీలు తనను అనుసరిస్తూ పేరడీ చేయడంపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ మండిపడ్డారు. ''ఇది సిగ్గుచేటు.. ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో కల్యాణ్ బెనర్జీ ''నా వెన్నెముక నిటారుగా ఉంటుంది. నేను చాలా పొడగరిని'' అంటూ ధన్‌ఖడ్ తరహాలో అభినయించినట్టు కనిపిస్తోంది. ఎంపీల సస్పెన్సన్ అనంతరం తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే జగ్దీప్ ధన్‌ఖడ్ పరోక్షంగా రాహుల్‌ను ఉద్దేశిస్తూ... ''చైర్మన్ పదవి, స్పీకర్ పదవి రెండింటికీ చాలా వైరుధ్యం ఉంది. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరిపై ఒకరు విసుర్లు విసురుకోవచ్చు. కానీ, మీ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత, మరో పార్టీకి చెందిన వ్యక్తిని వీడియో తీస్తున్నారు'' అని అన్నారు.


సిగ్గు...సిగ్గు

కాగా, సస్పెండైన విపక్ష ఎంపీలు జగ్దీప్ ధన్‌ఖడ్‌ను అనుసరిస్తూ చేసిన పేరడీ వీడియోను బీజేపీ షేర్ చేసింది. ఉపరాష్ట్రపతిని బెనర్జీ, రాహుల్ పరిహసించారంటూ మండిపడింది. ''విపక్ష ఎంపీలను ఎందుకు సస్పెండ్ చేశారని దేశం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే..దానికి ఈ వీడియోనే సమాధానం. ఉపరాష్ట్రపతిని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ గేళి చేస్తున్నారు. ఇదిచూసి రాహుల్ గాంధీ చిరునవ్వులు నవ్వుతున్నారు. దీనిని బట్టే వీరు సభలో ఎంత నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుంటారో ఎవరికి వారే ఊహించుకోవచ్చు'' అని ఆ ట్వీట్‌లో బీజేపీ పేర్కొంది.

Updated Date - Dec 19 , 2023 | 04:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising