ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi : ఇస్రో కేంద్రానికి చేరుకున్న మోదీ..

ABN, First Publish Date - 2023-08-26T07:44:55+05:30

పీణ్యాలోని ఇస్రో కేంద్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. నేడు ఆయన దక్షిణాఫ్రికా నుంచి నేరుగా బెంగుళూరుకు వచ్చారు. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో మోదీకి కర్ణాటక సీఎస్‌, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

బెంగళూరు : పీణ్యాలోని ఇస్రో కేంద్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. నేడు ఆయన దక్షిణాఫ్రికా నుంచి నేరుగా బెంగుళూరుకు వచ్చారు. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో మోదీకి కర్ణాటక సీఎస్‌, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. HAL నుంచి రోడ్డు మార్గంలో ఇస్రోకు మోదీ చేరుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తున్న మార్గంలో జాతీయ జెండాలతో ప్రజలు బారులు తీరి మోదీకి స్వాగతం పలికారు. హెచ్ఏఎల్ నుంచి ఇస్రోకు వెళ్లే 30 కిలోమీటర్ల మార్గంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. చంద్రయాన్-3 సక్సెస్‌కు కృషి చేసిన శాస్త్రవేత్తలతో మోదీ భేటీ కానున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆదిత్యా L-1 మిషన్, గగన్ యాన్ పై మోదీ ఆరా తీయనున్నారు. 8 గంట‌ల వ‌ర‌కు ఇస్రో కేంద్రంలో మోదీ గడపనున్నారు. 8:30 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

Updated Date - 2023-08-26T07:44:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising