ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit shah meet Modi: దేశ పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-06-26T14:32:00+05:30

అమెరికా, ఈజిప్టులో ఆరు రోజుల అధికారిక పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులతో సోమవారంనాడు సమావేశమయ్యారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమెరికా, ఈజిప్టులో ఆరు రోజుల అధికారిక పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన మంత్రివర్గ సహచరులతో సోమవారంనాడు సమావేశమయ్యారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు అమిత్‌షా (Amit Shah) నేరుగా ప్రధానితో భేటీ అయ్యారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి ఆయన వివరించినట్టు సమాచారం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు ఢిల్లీలో అమిత్‌షాను కలుకున్న నేపథ్యంలో మోదీతో అమిత్‌షా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏం జరుగుతోంది?

ప్రధానమంత్రి ఇండియాకు తిరిగి రాగానే దేశంలో ఏమి జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులను సైతం అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బీజపీ ఎంపీ మనోజ్ తివారీ సమాధానమిస్తూ, అంతా సజావుగానే సాగుతోందా అని నడ్డాను మోదీ ప్రశ్నించారని, ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని, అంతా సంతోషంగా ఉన్నారని నడ్డా సమాధానమిచ్చారని తెలిపారు.

షాతో బీరేన్ సింగ్ భేటీ

మణిపూర్‌లో పరిస్థితిపై గత శనివారంనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం, బీరేన్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని మెజారిటీ పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అమిత్‌షాను బీరేన్ సింగ్ ఆదివారంనాడు కలుసుకున్నారు. అనంతరం బీరేన్ సింగ్ ఒక ట్వీట్‌లో ఆ వివరాలు తెలిపారు. మణిపూర్‌లో పరిస్థితిని అమిత్‌షా సమీక్షించారని, ఆయన పర్యవేక్షణలో రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం గత వారంలో మణిపూర్‌లో హింసను చాలావరకు అదుపు చేసిందని చెప్పారు. జూన్ 13న హింస చెలరేగినప్పటి నుంచి ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపారు. మణిపూర్‌లో యథాపూర్వ పరిస్థితి నెలకొనేందుకు కేంద్రం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి భరోసా ఇచ్చినట్టు చెప్పారు.

Updated Date - 2023-06-26T14:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising