ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: ఈడీ, సీబీఐకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన విపక్ష పార్టీలు

ABN, First Publish Date - 2023-03-24T12:43:21+05:30

ఢిల్లీ: ప్రతిపక్ష నేతలపై ఈడీ (Enforcement Directorate), సీబీఐ (CBI) కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ఏప్రిల్ 5న విచారణ జరపనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: ప్రతిపక్ష నేతలపై ఈడీ (Enforcement Directorate), సీబీఐ (CBI) కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ఏప్రిల్ 5న విచారణ జరపనుంది. ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ తప్పుడు కేసులు పెడుతోందని పేర్కొంటూ 14 విపక్ష పార్టీలు (14 Opposition Parties) న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈడీకి అపరిమిత అధికారాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అరెస్టుకు ముందు, తర్వాత మార్గదర్శకాలు (Guidelines) ఇవ్వాలని విపక్షాలు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశాయి.

జాతీయ, ప్రాంతీయ మొత్తం 14 రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు జరిగిందని చెప్పుకోవచ్చు. ఈడీ, సీబీఐ సంస్థలను రాజకీయ ప్రత్యర్ధులపై బీజేపీ (BJP) అధికార పక్షం ఉపయోగిస్తోంది. అందరినీ తమవైపు తిప్పుకోడానికి, లేదా భయపెట్టడానికి ఈడీ, సీబీఐలను ఉపయోగించి కేసులు పెట్టిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయాల్సిన అవసరం ఉందంటూ విపక్షాలు పిటిషన్‌లో పేర్కొన్నాయి. శుక్రవారం సీజేఐ చంద్రచూడ్ (CJI Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం ముందు విపక్షాలు ఈ పిటిషన్‌ను మెన్షన్ చేశాయి.

డెమొక్రసి ప్రమాదంలో పడిందని మొత్తం 42 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు చెబుతున్నాయి. ఈడీ, సీబీఐ సంస్థలు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నాయని, దీనిపై కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా పార్టీలు పేర్కొన్నాయి.

Updated Date - 2023-03-24T12:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising