Nirmala Sitharaman: అనుమతిలేకుండా ఓ వీధికి నిర్మలా సీతారామన్ పేరు
ABN, Publish Date - Dec 30 , 2023 | 10:12 AM
రామనాథపురం జిల్లా లాందై గ్రామంలో నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) రోడ్డు పేరుతో ఉన్న బోర్డును రహదారుల శాఖ అధికారులు తొలగించారు. లాందై గ్రామ సమీపంలోని రైల్వే సబ్‌వేకు ప్రత్యామ్నాయంగా ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు పదేళ్లుగా కోరుతున్నారు.
- బోర్డును తొలగించిన అధికారులు
పెరంబూర్(చెన్నై): రామనాథపురం జిల్లా లాందై గ్రామంలో నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) రోడ్డు పేరుతో ఉన్న బోర్డును రహదారుల శాఖ అధికారులు తొలగించారు. లాందై గ్రామ సమీపంలోని రైల్వే సబ్‌వేకు ప్రత్యామ్నాయంగా ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు పదేళ్లుగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ సమస్యపై దృష్టి సారించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman), ఆ ప్రాంతంలో ఫ్లై ఓవర్ ఏర్పాటుకు రూ.17.32 కోట్ల కేటాయించేలా కృషి చేశారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపేలా ఆ ప్రాంతంలోని రోడ్డుకు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించిన గ్రామస్తులు, బీజేపీ నేతలు, బుధవారం ఆ ప్రాంతంలో ‘నిర్మలా సీతారామన్ రోడ్డు’ అనే బోర్డును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, అనుమతులు లేకుండా బోర్డు ఏర్పాటు చేశారని పేర్కొంటూ గురువారం ఆ బోర్డును రహదారుల శాఖ అధికారులు తొలగించారు.
Updated Date - Dec 30 , 2023 | 10:12 AM