ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi Covid Review: కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని మోదీ కీలక సమీక్ష

ABN, First Publish Date - 2023-03-22T18:53:31+05:30

దేశంలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కోవిడ్-19 (Covid) కేసులు పెరుగుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన బుధవారం నాడు అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కోవిడ్ పరిస్థితి, ప్రజారోగ్య సన్నద్ధతపై ఈ సమావేశంలో మోదీ సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్, పీఎంఓ కార్యాలయం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం ఒక్క రోజు 1,134 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 7,000కు చేరుకుంది. మృతుల రేటు 1.19 శాతంగా నమోదైంది.

6 రాష్ట్రలకు అడ్వయిజరీ...

కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించడంతో హోం శాఖ గతవారంలో ఆరు రాష్ట్రాలకు అడ్వయిజరీలు జారీ చేసింది. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఉన్నాయి. స్థానికంగా కరోనా వ్యాప్తి వల్ల కేసులు పెరగే అవకాశాలున్నాయని, రిస్క్ అంచనా వేసి, నిరోధక చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించారు. కరోనా లక్షణాలపై నిఘా ఉంచడం, వేగంగా విస్తరించే ఏరియాలను గుర్తించి ముందస్తు చర్చలు తీసుకోవాలని తెలిపారు.

Updated Date - 2023-03-22T19:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising