MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిక
ABN, First Publish Date - 2023-03-17T10:27:57+05:30
టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు, ఈరోడ్ తూర్పు ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్(MLA EVKS Ilangovan) గురువారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబీకులు
పెరంబూర్(చెన్నై): టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు, ఈరోడ్ తూర్పు ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్(MLA EVKS Ilangovan) గురువారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబీకులు స్థానిక పోరూర్‌లోని శ్రీరామచంద్ర వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు సత్వర చికిత్స అందించి ఆయన్ని కాపాడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన్ని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇదిలా వుండగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ఆస్పత్రికెళ్లి ఇళంగోవన్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఇళంగోవన్ ఆరోగ్యంగా వున్నారని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని వివరించారు. ఇదిలా వుండగా ఈరోడ్ తూర్పు ఎమ్మెల్యేగా వున్న ఇళంగోవన్ కుమారుడు అనారోగ్యంతో కన్నుమూయడంతో అక్కడ గత నెల 27వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో ఆయనే పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-03-17T10:27:57+05:30 IST