KRS: అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం...
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:06 PM
కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్‌ఎస్) 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 లోక్‌సభా స్ధానాల నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు కేఆర్‌ఎస్ కార్యదర్శి బీఎస్ మల్లికార్జునయ్య(KRS Secretary BS Mallikarjunaiah) నగరంలో ఒక ప్రకటన విడుదల చేశారు.
- కేఆర్‌ఎస్ ప్రకటన
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్‌ఎస్) 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 లోక్‌సభా స్ధానాల నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు కేఆర్‌ఎస్ కార్యదర్శి బీఎస్ మల్లికార్జునయ్య(KRS Secretary BS Mallikarjunaiah) నగరంలో ఒక ప్రకటన విడుదల చేశారు. కేఆర్‌ఎస్ తరుపున పోటీ చేయాలనుకునే ఆసక్తి గలవారు జనవరి 6 నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులోని పార్టీ కార్యాలయానికి హాజరు కావాలని ప్రకటనలో కోరారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు తమ పట్టు సాధించుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఎన్నికలకు ముందస్తు కసరత్తు జోరందుకుంది.
Updated Date - Dec 28 , 2023 | 01:06 PM