ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KKSRTC : గవర్నమెంట్ బస్ చోరీ!

ABN, First Publish Date - 2023-02-21T20:27:39+05:30

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో కల్యాణ కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ (KKSRTC)కు చెందిన బస్సు మంగళవారం తెల్లవారుజామున

KKSRTC bus
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో కల్యాణ కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ (KKSRTC)కు చెందిన బస్సు మంగళవారం తెల్లవారుజామున చోరీకి గురైంది. చించోలీ బస్టాండ్‌, రెండో నెంబరు ప్లాట్‌ఫాం వద్ద ఉన్న ఈ బస్సును అక్కడే పచారీ చేస్తున్న కొందరు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు.

చోరీకి గురైన బస్సు బీదర్ నుంచి సోమవారం రాత్రి 9.15 గంటలకు చించోలీ బస్టాండ్‌కు చేరుకుంది. ఇక్కడ రెండో నెంబరు ప్లాట్‌ఫాం వద్ద దీనిని పార్క్ చేశారు. డ్రైవర్, కండక్టర్ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. మంగళవారం ఉదయం డ్రైవర్ వచ్చి చూసేసరికి బస్సు కనిపించలేదు.

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ బస్సు తాండూరు మార్గంలో తెలంగాణా వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ దొంగతనం ఇంటి మనుషుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

2021 అక్టోబరులో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. తుమకూరు జిల్లాలో పార్క్ చేసిన బస్సును కొందరు దుండగులు పట్టుకెళ్లిపోయారు. 30 కిలోమీటర్ల దూరంలో ఆ బస్సును వదిలేసి, దానిలోని డీజిల్‌ను పట్టుకెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి :

Uttar Pradesh : ముస్లిం విద్యార్థులు గెడ్డం తీయరాదు : దారుల్ ఉలూమ్ ఫత్వా

Sri Lanka : బ్యాలట్ పేపర్ల ముద్రణకు డబ్బుల్లేక, ఎన్నికలు వాయిదా

Updated Date - 2023-02-21T20:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising