ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab : ఖలిస్థాన్ నేత అమృత్ పాల్ సింగ్ అరెస్ట్... ఇంటర్నెట్ సేవలు నిలిపివేత...

ABN, First Publish Date - 2023-03-18T16:18:12+05:30

ఖలిస్థాన్ నేత (Khalistani leader), వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ( Waris Punjab De chief Amritpal Singh )ను పంజాబ్ పోలీసులు

Amrit Pal Singh, Punjab
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జలంధర్ : ఖలిస్థాన్ నేత (Khalistani leader), వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ( Waris Punjab De chief Amritpal Singh )ను పంజాబ్ పోలీసులు శనివారం జలంధర్ సమీపంలో అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయనకు సన్నిహితంగా ఉండే ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురిని గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి, ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అమృత్ పాల్ సింగ్ షాహ్‌కోట్ సమీపంలో ఉన్నట్లు గుర్తించిన పంజాబ్ పోలీసులు శనివారం ఉదయం దాదాపు 50 వాహనాల్లో వెళ్లారు. ఆయనను గుర్తించి, వెంటాడారు. చివరికి నకోదర్ సమీపంలో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని అనేక జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఆదివారం (మార్చి 19 రాత్రి 12 గంటల) వరకు కొనసాగుతాయి. బ్యాంకింగ్, మొబైల్ రీఛార్జి మినహా మిగిలిన మొబైల్ ఇంటర్నెట్ సేవలు, ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించారు. కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే అనుమతిస్తారు. ప్రజాభద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ హోం వ్యవహారాలు, న్యాయ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

అమృత్ పాల్ సింగ్, ఆయన అనుచరులు గత నెలలో అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. వీరంతా ఆయుధాలను గాలిలో తిప్పుతూ భయానక పరిస్థితులను సృష్టించారు. వీరి దాడిలో కొందరు పోలీసులు గాయపడ్డారు. అల్లర్ల కేసులో అరెస్టయిన తమ అనుచరుడిని వదిలిపెట్టాలని వీరంతా డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్‌?

Congress Vs BJP : రాహుల్ గాంధీపై వినూత్నంగా విరుచుకుపడిన జైశంకర్

Updated Date - 2023-03-18T17:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising