ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Excise Policy : మద్యం విధానంపై కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2023-03-15T13:57:07+05:30

పాత మద్యం విధానాన్నే మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని

Arvind Kejriwal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : పాత మద్యం విధానాన్నే మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూతన మద్యం విధానాన్ని సత్వరమే రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రభుత్వం రూపొందించిన కొత్త మద్యం విధానంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ - CBI), ఈడీ (Enforcement Directorate) అరెస్ట్ చేశాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

పాత మద్యం విధానాన్ని మరో ఆరు నెలలపాటు అమలు చేయాలని నిర్ణయించిన కేజ్రీవాల్ ప్రభుత్వం, ఈ ఆరు నెలల్లో ఐదు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని నిర్ణయించింది. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బుద్ధ పూర్ణిమ, ఈద్ అల్ ఫితర్, ఈద్ అల్ అదా రోజుల్లో మద్యం అమ్మకాలను నిలిపేయాలని నిర్ణయించింది.

ఇదిలావుండగా, కేజ్రీవాల్ మంగళవారం మధ్య ప్రదేశ్‌లో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై విరుచుకుపడ్డారు. మన దేశానికి విద్యావంతుడైన ప్రధాన మంత్రి అవసరమన్నారు. మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)ని గెలిపిస్తే, ఉచిత విద్యుత్తు, విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగవచ్చు.

ఇవి కూడా చదవండి :

Minister: ఆ పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం

Land for jobs Case : సీబీఐ కేసులో లాలూ, రబ్రీ, మీసా పిటిషన్లపై ఢిల్లీ కోర్టు సంచలన ఆదేశాలు

Updated Date - 2023-03-15T13:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising