ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka : పెళ్లయిన కుమార్తెలకు శుభవార్త!

ABN, First Publish Date - 2023-01-04T16:13:03+05:30

పెళ్లయిన కుమారుడి హోదా కుమారుడిగానే ఏ విధంగా కొనసాగుతుందో, అదే విధంగా పెళ్లయిన కుమార్తె (married daughter) హోదా

Karnataka High Court
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : పెళ్లయిన కుమారుడి హోదా కుమారుడిగానే ఏ విధంగా కొనసాగుతుందో, అదే విధంగా పెళ్లయిన కుమార్తె (married daughter) హోదా కూడా కుమార్తెగానే కొనసాగుతుందని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) జనవరి 2న తీర్పు చెప్పింది. మాజీ సైనికోద్యోగుల పిల్లలకు అందజేసే డిపెండెంట్ కార్డులను పొందే అర్హత వివాహిత కుమార్తెలకు లేదని చెప్తున్న సైనిక సంక్షేమ మండలి మార్గదర్శకాలను రద్దు చేసింది.

జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జనవరి రెండున ఇచ్చిన తీర్పులో, ‘‘కుమారుడు పెళ్లయినా, కాకపోయినా కుమారునిగానే కొనసాగుతున్నపుడు; కుమార్తె పెళ్లయినా, కాకపోయినా, కుమార్తెగానే కొనసాగాలి. కుమారుని హోదాను వివాహం మార్చనపుడు, కుమార్తె హోదాను పెళ్లి మార్చకూడదు’’ అని తెలిపింది.

సైనిక దళాల్లో స్త్రీ, పురుష సమీకరణలు మారుతున్నందువల్ల తటస్థంగా ఉండే పదాలను వాడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మాజీ సైనికోద్యోగులను ప్రస్తావించేటపుడు ఎక్స్ సర్వీస్‌మెన్ అనే పదానికి బదులుగా ఎక్స్ సర్వీస్ పర్సనల్ అనే పదాన్ని ఉపయోగించాలని తెలిపింది.

సుబేదార్ రమేశ్ ఖండప్ప పోలీస్ పాటిల్ 2001లో ‘ఆపరేషన్ పరిక్రమ్’లో భాగంగా మందుపాతరలను తొలగిస్తుండగా అమరుడయ్యారు. ఆయన కుమార్తె ప్రియాంక పాటిల్ డిపెండెంట్ కార్డ్ కోసం ప్రయత్నించారు. కానీ ఆమెకు ఆ కార్డు మంజూరు కాలేదు. దీంతో ఆమె న్యాయస్థాన్ని ఆశ్రయించారు.

సుబేదార్ రమేశ్ మరణించేనాటికి ప్రియాంక వయసు 10 సంవత్సరాలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ జరిగింది. మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు నిబందనలు పేర్కొన్నాయి. దీంతో ఆమె డిపెండెంట్ కార్డ్ కోసం ప్రయత్నించారు. ఈ కార్డును మంజూరు చేయడానికి సైనిక సంక్షేమ మండలి తిరస్కరించింది. ఆమెకు వివాహమైనందున ఈ కార్డును మంజూరు చేయబోమని తెలిపింది. వివాహం కానటువంటి మహిళలకు మాత్రమే డిపెండెంట్ కార్డులను మంజూరు చేయాలని నిబంధనలు చెప్తున్నట్లు తెలిపింది. దీంతో ఆమె 2021లో హైకోర్టును ఆశ్రయించారు.

మహిళలకు డిపెండెంట్ కార్డుల జారీ విషయంలో సైనిక సంక్షేమ మండలి (Sainik Welfare Board) నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలు 14, 15లకు విరుద్ధంగా ఉన్నట్లు జస్టిస్ నాగ ప్రసన్న తన తీర్పులో చెప్పారు. దశాబ్దాల క్రితం అమల్లో ఉన్న మూస ఆలోచనా విధానం ఈ నిబంధనల్లో కనిపిస్తోందన్నారు. ఈ నిబంధనలను ఇలాగే కొనసాగనిస్తే, స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించే మార్గంలో కాలం చెల్లిన అడ్డంకులుగా నిలుస్తాయన్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం 2021 ఆగస్టు 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ప్రియాంకకు రిజర్వేషన్ ఫలాలను అందజేసే విషయాన్ని పరిశీలించాలని కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీని జస్టిస్ ఎం నాగ ప్రసన్న (Justice M Nagaprasanna) ఆదేశించారు.

Updated Date - 2023-01-04T16:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising