ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

I.N.D.I.A.: 'ఇండియా' కూటమి కమిటీల్లో కొత్తగా మరో ఏడుగురికి చోటు

ABN, First Publish Date - 2023-09-02T21:22:23+05:30

లో‌క్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా లోని వివిధ వర్కింగ్‌ కమిటీల్లో కొత్తగా ఏడుగురికి సభ్యత్వం కల్పించారు. 26 విపక్ష పార్టీలతో కూడిన 'ఇండియా' కూటమి ముంబై సమావేశంలో 14 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని, 19 మంది సభ్యుల ప్రచార కమిటీని ప్రకటించడం తెలిసిందే.

న్యూఢిల్లీ: లో‌క్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)లోని వివిధ వర్కింగ్‌ కమిటీల్లో కొత్తగా ఏడుగురికి సభ్యత్వం కల్పించారు. 26 విపక్ష పార్టీలతో కూడిన 'ఇండియా' కూటమి ముంబై సమావేశంలో 14 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని, 19 మంది సభ్యుల ప్రచార కమిటీని ప్రకటించడం తెలిసిందే.


ప్రచార కమిటీ సభ్యులు వీరే..

ప్రచార కమిటీలో సభ్యులుగా డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, పీడీపీ నేత మెహబూబ్ బేగ్‌లను కొత్తగా చేర్చారు. జాబితాలో ఇప్పటికే ప్రకటించిన ఇతరుల్లో గుర్‌దీప్ సింగ్ సప్పల్ (ఐఎన్‌సీ) సంజయ్ ఝా (జేడీయూ), అనిల్ దేశాయ్ (శివసేన-యూబీటీ), సంజయ్ యాదవ్ (ఆర్జేడీ), పీసీ ఛాకో (ఎన్‌సీపీ), చాంపాయ్ సోరెన్ (జేఎంఎం), కరిణ్మయి నంద (ఎస్‌పీ), సంజయ్ సింగ్ (ఏఏపీ), అరుణ్ కుమార్ (సీపీఎం) ఉన్నారు.


సోషల్ మీడియా టీమ్‌లో కొత్తగా డీఎంకే నేత దయానిధి మారన్, రాష్ట్రీయ లోక్‌దళ్ నేత రోహిత్ జాఖడ్ వచ్చి చేరారు. గతంలో సుప్రియ శ్రినటె (ఐఎన్‌సీ), సుమిత్ శర్మ (ఆర్జేడీ), ఆశిష్ యాదవ్ (ఎస్‌పీ), రాజీవ్ నిగమ్ (ఎస్‌పీ), రాఘవ్ చద్దా (ఏఏపీ), అవిందని (జేఎంఎం), ఇల్తిజ మెహబూబా (పీడీపీ)ను ప్రకటించారు.


మీడియా వర్కింగ్ గ్రూప్‌లో కొత్తగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, డీఎంకే నేత కనిమొళి కరుణానిధి కొత్తగా వచ్చి చేరారు. ఇప్పటికే జాబితాలో ప్రకటించిన ఇతరులలో జైరామ్ రమేష్ (ఐఎన్‌సీ), మనోజ్ ఝా (ఆర్జేడీ), అరవింద్ సావంత్ (శివసేన-యూబీటీ), జితేంద్ర అవద్ (ఎన్‌సీపీ), రాఘవ్ చద్దా (ఏఏపీ), రాజీవ్ రంజన్ (జేడీయూ) ప్రాంజల్ (సీపీఎం), ఆశిష్ యాదవ్ (ఎస్‌పీ), సుప్రియా భట్టాచార్య (జేఎంఎం), అలోక్ కుమార్ (జేఎంఎం), మనీష్ కుమార్ (జేడీయూ), రాజీవ్ నిగమ్ (ఎస్‌పీ), బాలచందర్ కాంగో (సీపీఐ) ఉన్నారు.


వర్కింగ్ గ్రూప్ ఫర్ రీసెర్చ్‌లో డీఎంకే నేత ఏ.రాజాను చేర్చారు. ఇంతకుముందు ప్రకటించిన వారిలో అమితబ్ దుబే (ఐఎన్‌సీ) సుబోధ్ మెహతా (ఆర్జేడీ), ప్రియాంక చతుర్వేది (శివసేన-యూబీటీ), వందన చవాన్ (ఎన్‌సీపీ), కేసీ త్యాగి (జేడీయూ), సుదివ్య కుమార్ సోను (జేఎంఎం), జాస్మిన్ షా (ఏఏపీ), అలోక్ రంజన్ (ఎస్‌పీ), ఇమ్రాన్ నబి డర్ (ఎన్‌సీ) ఉన్నారు.


ముంబైలో శుక్రవారంనాడు జరిగిన 'ఇండియా' కూటమి సమావేశంలో రాబోయే ఎన్నికల్లో సాధ్యమైనంత వరకూ కలిసికట్టుగా పోరాడాలని, వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలకు సంబంధించిన ఏర్పాటు తక్షణం చేపట్టాలని నిర్ణయించారు.

Updated Date - 2023-09-02T21:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising