ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jairam Ramesh: చర్చ నుండి ప్రధాని మోదీ పారిపోతున్నారు.. జైరాం రమేశ్ కౌంటర్ ఎటాక్

ABN, Publish Date - Dec 17 , 2023 | 06:48 PM

యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరా రమేశ్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఈ అంశంపై చర్చ నుంచి ఆయన పారిపోతున్నారని విమర్శించారు.

Jairam Ramesh Targets PM Modi: యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరా రమేశ్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఈ అంశంపై చర్చ నుంచి ఆయన పారిపోతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై మోదీ మౌనం వీడారు కానీ.. దీనిపై విచారణ మాత్రమే జరగాలని, చర్చ అవసరం లేదని అన్నారని పేర్కొన్నారు. తాము చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. మోదీ మాత్రం చర్చకు దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు.

‘‘డిసెంబర్ 13వ తేదీన లోక్‌సభలో జరిగిన అసాధారణ ఘటనలపై ప్రధాని మోదీ ఎట్టకేలకు మౌనం వీడారు. ఈ అంశం విచారణ అవసరమని, చర్చ కాదని ఆయనన్నారు. ఆయన చెప్పినట్లుగానే దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే.. డిసెంబరు 13వ తేదీన ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే దానిపై ఒక ప్రకటన ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిని ‘ఇండియా’ కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది’’ అని జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. అయితే.. ప్రధాని మోదీ మాత్రం సాధారణ కారణంతో చర్చ నుంచి పారిపోతున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 13న లోక్‌సభలోకి చొరబడిన దుండగులు మైసూరుకి చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ద్వారా విజిటర్ పాస్‌లు పొందారని.. ఈ ఘటనలో ఆయన పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


ఈ ఘటనపై మోదీ ఏమన్నారు?

ఈ సంఘటన చాలా ఆందోళనకరమైనదిగా, ఈ అంశంపై చర్చ లేదా ప్రతిఘటనకు బదులుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తెలిపారు. విచారణ ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యపై గొడవలు మానుకోవాలని, సమష్టి స్పూర్తితో పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఘటన తీవ్రమైనదని పేర్కొన్న ఆయన.. దీనిపై చర్చ ఏమాత్రం అవసరం లేదని, సమగ్ర విచారణ జరపాలని చెప్పుకొచ్చారు. అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని ప్రతిపక్షాల్ని కోరారు.

ఇదిలావుండగా.. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఆరు మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన రోజే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి పేర్లు నీలం, అమోల్ షిండే, సాగర్, మనోరంజన్ ఉన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న లలిత్ ఝాను ఒక రోజు తర్వాత అరెస్ట్ చేశారు. అనంతరం ఆరో నిందితుడు మహేష్ కుమావత్‌ను అరెస్టు చేయడం జరిగింది. తొలుత నిందితులు తమకి తాము నిప్పంటించుకోవాలని ప్లాన్ చేశారని, ఆ తర్వాత ఆ ఆలోచనని విరమించుకొని పసుపు రంగు గ్యాస్ డబ్బాలతో లోక్‌సభలో రాద్ధాంతం సృష్టించారని పోలీసు విచారణలో తేలింది.

Updated Date - Dec 17 , 2023 | 06:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising