ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థానీ ఐఎస్ఐ ఏజెంట్ : నిఘా వర్గాలు

ABN, First Publish Date - 2023-03-19T11:00:45+05:30

ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పాకిస్థానీ ఐఎస్ఐ

Amrit Pal Singh, Punjab
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పాకిస్థానీ ఐఎస్ఐ (Pakistani spy agency) ఏజెంట్ అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ పాకిస్థానీ గూఢచార సంస్థ భారత దేశంలో హింసను సృష్టించేందుకు, ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని రగిలించేందుకు ఆయనను భారత దేశానికి తీసుకొచ్చిందని వెల్లడిస్తున్నాయి. పంజాబ్ పోలీసులు శనివారం ఆయన సహచరుల్లో కొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అమృత్‌పాల్ సింగ్ తిరిగి భారత దేశానికి రావడం వెనుక పెద్ద కుట్ర ఉందని నిఘా వర్గాలు చెప్తున్నాయి. విదేశాల్లోని సిక్కు వేర్పాటువాదుల సహాయంతో ఆయనను పాకిస్థానీ ఐఎస్ఐ (Inter Services Intelligence) పంపించిందని చెప్తున్నాయి. ఆయన దుబాయ్‌లో లారీ డ్రైవర్‌గా పని చేసేవాడని, భారత దేశానికి వెలుపల ఉన్న ఖలిస్థాన్ మద్దతుదారుల సహాయంతో ఐఎస్ఐ ఆయనను రాడికలైజ్ చేసిందని చెప్తున్నారు. పంజాబ్‌లో మళ్ళీ ఉగ్రవాదం చీకటి రోజులను తీసుకొని రావడం కోసం ఆయనను రాడికలైజ్ చేసి పంపించారని చెప్తున్నారు.

అమృత్‌పాల్ సింగ్ బహిరంగంగానే వేర్పాటువాద ప్రకటనలు చేస్తున్నాడు. భారత దేశం నుంచి ప్రత్యేక ఖలిస్థాన్ ఏర్పాటు చేస్తామంటున్నాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann)లను బెదిరిస్తున్నాడు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌ ఉగ్రవాదుల చేతుల్లో మరణించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు.

సిక్కులపై భారత ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని, ప్రత్యేక ఖలిస్థాన్ ఏర్పాటయ్యేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై సాయుధ తిరుగుబాటు చేయాలని సిక్కు యువతను అమృత్‌పాల్ రెచ్చగొడుతున్నాడని నిఘా అధికారులు తెలిపారు.

పంజాబ్‌లోని మోగా జిల్లా, రోడేలో అమృత్‌పాల్ గతంలో మాట్లాడుతూ, సిక్కు మతానికి చెందనివారు నడిపే ప్రభుత్వాలకు ఇక్కడి ప్రజలను పరిపాలించే హక్కు లేదని, సిక్కు మతస్థులను కేవలం సిక్కులు మాత్రమే పరిపాలించాలని అన్నాడు.

ఇవి కూడా చదవండి :

Amritpal: చిక్కినట్టే చిక్కి..

Chandrababu: ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా?

Updated Date - 2023-03-19T11:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising