ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Army rescues: నార్త్ సిక్కింలో 500మంది పర్యాటకులను కాపాడిన ఇండియన్ ఆర్మీ

ABN, First Publish Date - 2023-05-20T12:00:35+05:30

నార్త్ సిక్కింలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు దిగ్బంధనం వల్ల చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది....

Indian Army rescues
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాచుంగ్ (నార్త్ సిక్కిం): నార్త్ సిక్కింలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు దిగ్బంధనం వల్ల చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది.(Indian Army rescues) ఉత్తర సిక్కింలోని లాచుంగ్ లోయల ప్రాంతానికి ప్రయాణిస్తున్న 500 మంది పర్యాటకులు(500 tourists) కొండ చరియలు విరిగిపడటంతో మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. రహదారి దిగ్బంధనం కారణంగా చుంగ్తాంగ్ వద్ద పర్యాటకులు చిక్కుకుపోయారు. లాచుంగ్, చుంగ్తాంగ్‌లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయి.(North Sikkim due to land slides)చుంగ్తాంగ్ ప్రాంత అధికారుల అభ్యర్థన మేరకు త్రిశక్తి కార్ప్స్, ఇండియన్ ఆర్మీ దళాలు రంగంలోకి దిగి చిక్కుకుపోయిన పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

ఇది కూడా చదవండి : Karnataka: 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం

పర్యాటకుల్లో 216 మంది పురుషులు, 113 మంది మహిళలు ,54 మంది పిల్లలతో సహా చిక్కుకుపోయిన పర్యాటకులను మూడు వేర్వేరు ఆర్మీ క్యాంపులకు తరలించారు. పర్యాటకులకు వేడివేడిగా భోజనం పెట్టి వారికి వెచ్చని దుస్తులను అందించారు. రాత్రిపూట పర్యాటకులకు వసతి కల్పించేందుకు సైనికులు తమ బ్యారక్‌లను ఖాళీ చేశారు.పర్యాటకులకు వైద్య సహాయం అందించారు. పగటిపూట గురుడోగ్మార్ సరస్సును సందర్శించిన ఒక మహిళ తీవ్రమైన తలనొప్పితో బాధపడటంతో సమీపంలోని ఫీల్డ్ హాస్పిటల్ నుంచి మహిళా మెడికల్ ఆఫీసర్‌తో సహా వైద్య బృందాన్ని తీసుకువచ్చారు. వెంటనే ఆమెకు వైద్యసేవలు అందించి వైద్యశాలలోని ఐసీయూకి తరలించారు. వీలైనంత త్వరగా వాహనాల రాకపోకలకు రహదారిని క్లియర్ చేయడానికి ఆర్మీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2023-05-20T12:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising