ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Turkey Earthquake: టర్కీ సాయం అడగ్గానే మోదీ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2023-02-06T17:01:08+05:30

భారీ భూకంపంతో టర్కీ అతలాకుతలమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Narendra Modi on Turkey Earthquake
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారీ భూకంపంతో టర్కీ (Turkey Earthquake) అతలాకుతలమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలను టర్కీ పంపిస్తున్నారు. అలాగే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపిస్తున్నారు. గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్(India) నుంచి తీసుకెళ్తున్నాయి. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో కనీసం వందమంది సిబ్బంది ఉంటారని వీరు టర్కీ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. డాగ్ స్క్వాడ్ కూడా ఎన్‌డీఆర్ఎఫ్‌ టీమ్‌తో వెళ్తోంది. మెడికల్ బృందాల్లో శిక్షణ పొందిన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఔషదాలు, ఇతర సహాయ సామాగ్రి కూడా తీసుకెళ్తున్నారు. టర్కీ ప్రభుత్వంతో పాటు అంకారా(ankara)లోని భారత ఎంబసీతో పాటు ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయంతో భారత బృందాలు సమన్వయం చేసుకుంటాయి.

ప్రధానమంత్రి మోదీ ఆదేశాలతో పీఎంఓలో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేబినెట్ కార్యదర్శి, హోం మంత్రిత్వ శాఖ, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ, ఆరోగ్యశాఖ, ఎన్డీఆర్ఎఫ్ విభాగంలోని ప్రతినిధులు హాజరయ్యారు.

సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ( Major Earthquake ) టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాలను కుదిపేసింది. సైప్రస్(Cyprus), లెబనాన్‌( Lebanon)లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకూ 16 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు భూకంపం వచ్చాక ఇప్పటివరకూ మొత్తం 40 సార్లు భూమి కంపించింది.

దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్ సమీపంలో నరుద్గీకి 23 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూజి జియాలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో భవనాలు, అపార్ట్‌మెంట్లు కూలిపోయాయని, భారీ ఆస్తినష్టం జరిగింది. ప్రజలు హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు.

భారీ భూకంపం తర్వాత హైఅలర్ట్ ప్రకటించినట్టు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. సిప్రస్, టర్కీ, గ్రీస్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యూకే, ఐరాక్, జార్జియాలోనూ ప్రకంపనలు సంభవించాయి.

సిరియాలోని అలెప్పో, సెంట్రల్ సిటీ హమాలో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. బీరూట్, డమాస్కస్‌లలో అపార్ట్‌మెంట్లు, భవనాలు కంపించడంతో స్థానిక ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

టర్కీ లోని 10 నగరాలపై భూకంప ప్రభావం ఉన్నట్టు టర్కీ దేశీయాంగ మంత్రి సులేమాన్ సోయిల్ తెలిపారు. గజియాన్‌టెప్, కహ్రమాన్‌మరస్, హటాయ్, ఒస్మానియె, అడియమన్, మలట్య, అడన, కిలిస్ తదితర నగరాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.

టర్కీ, సిరియా (Syria) ఆసుపత్రుల్లో ఎటు చూసినా భూకంప బాధితులే కనపడుతున్నారు. గాయపడ్డవారిలో చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరణాల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. ఆసుపత్రులు మరుభూములను తలపిస్తున్నాయి.

భారీ భూకంపం నేపథ్యంలో టర్కీ అంతర్జాతీయ సాయం కోరింది. వెనువెంటనే భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఆపత్కాలంలో తక్షణమే స్పందించి మానవతా సాయం పంపారు. ఎన్డీఆర్ఎఫ్, మెడికల్ బృందాలను వెనువెంటనే టర్కీకి పంపారు. మరింత సాయం అందించేందుకు కూడా మోదీ సానుకూలత తెలిపారు. ఎలాంటి సాయమైనా అందిస్తామన్నారు. అదే సమయంలో టర్కీతో పాటు సిరియాకు కూడా సాయమందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. సిరియాకు కూడా సహాయక బృందాలను పంపనుంది.

Updated Date - 2023-02-06T17:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising