ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Parliament Inauguration: నేను వెళ్లనందుకు సంతోషిస్తున్నా... పవార్ పంచ్..!

ABN, First Publish Date - 2023-05-28T19:41:45+05:30

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరిగిన తీరుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొద్దుటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత తనకు ఏమాత్రం సంతోషం కలిగించలేదని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం (New Parliament Building) జరిగిన తీరుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అసంతృప్తి వ్యక్తం చేశారు. పొద్దుటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత తనకు ఏమాత్రం సంతోషం కలిగించలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన అనంతరం పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

''ఉదయం ఈ కార్యక్రమాన్ని చూశాను. నేను వెళ్లనందుకు సంతోషించాను. అక్కడ జరిగిన తంతు చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. దేశాన్ని మనం తిరోగమన దిశగా తీసుకువెళ్లాలనుకుంటున్నామా? కొంతమంది వ్యక్తులకే ఈ కార్యక్రమం పరిమితమా?'' అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సమాజం పట్ల ఉన్న దృక్కోణానికి పూర్తి భిన్నంగా కార్యక్రమం జరిగిందని పవార్ తప్పుపట్టారు. మోడ్రన్ సైన్స్ ఆధారిత సమాజాన్ని ఆవిష్కరించాలనే నెహ్రూ ఆలోచనగా ఉండేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అనేది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారని, కానీ రాజ్యసభ చైర్మన్ కూడా అయిన ఉపరాష్ట్రపతి అక్కడ లేరని, ఏతావాతా ఈ కార్యక్రమం మొత్తం కొద్దిమంది వ్యక్తులకే పరిమితమైనట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు.

పాత పార్లమెంటుతో ప్రత్యేక అనుబంధం

కేవలం పార్లమెంటు సభ్యుడుగా కాకుండా పాత పార్లమెంటు భవనంతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని పవార్ గుర్తు చేసుకున్నారు. కొత్త భవనం గురించి తమతో ఏరోజూ చర్చించలేదని, అందర్నీ కలుపుకొని వెళ్లి ఉంటే బాగుండేదని పవార్ అభిప్రాయపడ్డారు.

అసంపూర్తి ఘట్టం: సుప్రియ

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవాన్ని ''అసంపూర్తి ఘట్టం''గా ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే పేర్కొన్నారు. విపక్షాలు లేకుండా అసంపూర్తిగా జరిగిన కార్యక్రమం ఇదని, దేశంలో ప్రజాస్వామ్యమనేదే లేదని దీని అర్ధమని చెప్పారు.

Updated Date - 2023-05-28T19:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising