Home » Sharad Pawar
ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, పార్టీ ఎంపీ సుప్రియా సూలే బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా తాజాగా శరద్ పవార్ ఎన్‌సీపీ-ఎస్పీ సైతం ఆ దిశగానే వెళ్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ పోటీ చేయనున్నారు. విపక్ష 'మహా వికాస్ కూటమి' అభ్యర్థిగా శరద్ పవార్‌ను ఎంపిక చేసినట్టు ఆయన కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సులే తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను పుణెలోని రుబీ హాల్ ఆసుపత్రికి ఆదివారంనాడు తరలించారు.
సునేత్ర ప్రమాణస్వీకార కార్యక్రమంపై శరద్ పవార్ బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం ఉంటుందనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు.
మహారాష్ట్రలోని బారామతిలో బుధవారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో తన మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై శరద్ పవార్ తొలిసారి స్పందించారు.
కేంద్రంలోని అధికార ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని విపక్ష కూటమి ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.
ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ఇది చిన్న విషయం కాదని, దీనిని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుని సమీక్షించాలని సూచించారు. దీంతోపాటు ట్రంప్ విధానాలపై కూడా స్పందించారు.
ఫడ్నవిస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రజాజీవితం, సాధించిన విజయాలపై 'మహారాష్ట్ర నాయక్' అనే పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకంలో శరద్ పవార్ ఒక ఆర్టికల్ కూడా రాశారు.