శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:14 PM
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను పుణెలోని రుబీ హాల్ ఆసుపత్రికి ఆదివారంనాడు తరలించారు.
పుణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను పుణెలోని రుబీ హాల్ ఆసుపత్రికి ఆదివారంనాడు తరలించారు. డీహైడ్రేషన్‌తో ఆయన బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు.
'మైల్డ్ డీహైడ్రేషన్‌తో రుబీ హాల్ క్లినిక్‌లో శరద్ పవార్ చేరారు. ఇంట్రావీనస్ ఫ్యూయిడ్‌లు అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో రెండురోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాతే డిశ్చార్చి చేస్తాం' అని ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వెజ్ గ్రాంట్ తెలిపారు. ఆయనతో పాటు కన్సెల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ అభిజిత్ లోధా పర్యవేక్షణలో పవార్ చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన దగ్గు, గొంత ఇన్‌ఫెక్షన్‌తో ఇదే ఆసుపత్రిలో ఫిబ్రవరి 9న పవార్ చేరారు. ఫిబ్రవరి 14న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఇవి కూడా చదవండి..
నమో భారత్ ట్రైన్, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోదీ
ఏఐ సమ్మిట్ ఓ కీలక మలుపు! మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ