Share News

ఎంవీఏ రాజ్యసభ అభ్యర్థిగా శరద్ పవార్

ABN , Publish Date - Mar 04 , 2026 | 09:43 PM

మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్‌ పోటీ చేయనున్నారు. విపక్ష 'మహా వికాస్ కూటమి' అభ్యర్థిగా శరద్ పవార్‌ను ఎంపిక చేసినట్టు ఆయన కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సులే తెలిపారు.

ఎంవీఏ రాజ్యసభ అభ్యర్థిగా శరద్ పవార్
Sharad Pawar

ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్‌ (Sharad Pawar) పోటీ చేయనున్నారు. విపక్ష 'మహా వికాస్ కూటమి' (MVA) అభ్యర్థిగా శరద్ పవార్‌ను ఎంపిక చేసినట్టు ఆయన కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సులే తెలిపారు.


జయంత్ పాటిల్‌తో కలిసి ఉద్ధవ్ ఠాక్రేను తాను కలిసానని సుప్రియా సులే తెలిపారు. శరద్‌ పవార్‌కు మద్దతు ప్రకటించిన శివసేన (యూబీటీ), కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రియతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్దన్ సప్కల్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో ఈ విషయమై మాట్లాడామని, శరద్ పవర్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.


కాగా, మరోసారి రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేయనని శరద్ పవార్ కొద్దికాలం క్రితం ప్రకటించారు. అయితే గత నెలలో ఆయన మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో శరద్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో బీజేపీకి 131 సీట్లు ఉన్నాయి. శివసేన షిండేకి 57 మంది సభ్యులు, ఎన్‌సీపీ అజిత్ పవార్‌కు 40 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 ఓట్లు అవసరమవుతాయి. 20 సీట్లున్న శివసేన యూబీటీ, 16 సీట్లు కలిగిన కాంగ్రెస్, 10 సీట్లు గెలిచిన ఎన్‌సీపీ శరద్ పవార్ కలిసి ఒక రాజ్యసభ సీటును మాత్రమే దక్కించుకోగలవు.


ఇవి కూడా చదవండి..

డీఎంకేతో పొత్తు పదిలం.. కాంగ్రెస్‌కు 28 సీట్లు, ఒక రాజ్యసభ సీటు

రాజీనామా దిశగా నితీశ్ కుమార్.. రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం

Updated Date - Mar 04 , 2026 | 09:46 PM