Share News

డీఎంకేతో పొత్తు పదిలం.. కాంగ్రెస్‌కు 28 సీట్లు, ఒక రాజ్యసభ సీటు

ABN , Publish Date - Mar 04 , 2026 | 08:30 PM

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిరకాల భాగస్వామ్య పక్షమైన డీఎంకేతో కాంగ్రెస్ మరోసారి కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక రాజ్యసభ సీటును డీఎంకే ఆఫర్ చేసింది.

డీఎంకేతో పొత్తు పదిలం.. కాంగ్రెస్‌కు 28 సీట్లు, ఒక రాజ్యసభ సీటు
MK Stalin and Rahul Gandhi

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిరకాల భాగస్వామ్య పక్షమైన డీఎంకేతో కాంగ్రెస్ మరోసారి కలిసి పోటీ చేయడం ఖాయమైంది. సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక రాజ్యసభ సీటును డీఎంకే ఆఫర్ చేసింది. ఇందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. సీట్ల పంపకాల అంశంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు చెబుతున్నారు.


తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.


ఆప్‌ అరంగేట్రం..డీఎంకేతో చర్చలు

కాగా, తమిళనాడు ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనుంది. డీఎంకేతో కలిసి పోటీ చేసేందుకు ఆప్ నిర్ణయం తీసుకుంది. సీట్ల పంపకాలపై ఆ పార్టీతో చర్చలు జరుపుతోంది. దీనిపై తమిళనాడు ఆప్ కన్వీనర్ ఎస్ఏఎన్ వశీగరణ్ మీడియాతో మాట్లాడుతూ, డీఎంకే సమన్వయ కమిటీని కలిసామని, కొన్ని సీట్లు అడిగామని చెప్పారు. బీజేపీని అడ్డుకోవడానికి బలమైన కూటమి అవసరమన్నారు. గత పర్యాయం పార్లమెంటు ఎన్నికల్లో బలమైన విపక్ష కూటమి ఏర్పడిందని, అందులో ఆప్ కూడా ఉందని గుర్తుచేశారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తుతో ముందుకు వెళ్లాలనుంటున్నామనీ, కేజ్రీవాల్ సైతం ఎంకే స్టాలిన్‌తో మాట్లాడతారని, కచ్చితంగా తమ పార్టీకి గణనీయమైన సీట్లు దక్కుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. దక్షిణాదిన ఆప్ భారీ ఓపినింగ్స్ రాబట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

రాజీనామా దిశగా నితీశ్ కుమార్.. రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం

మాది పాలు.. తేనె సంబంధం

Updated Date - Mar 04 , 2026 | 09:56 PM