ప్రధాని మోదీతో శరద్ పవార్, సుప్రియా సూలే భేటీ.. ఎన్డీఏకు మద్దతు ఇవ్వబోతున్నారా..
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:27 PM
ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, పార్టీ ఎంపీ సుప్రియా సూలే బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది.
ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, పార్టీ ఎంపీ సుప్రియా సూలే బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్‌పీ) భవిష్యత్తులో ఎన్డీఏకు మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి (Sharad Pawar, Supriya Sule met PM Modi).
పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీలో ఏ అంశాలు చర్చించారనే విషయాన్ని ఇరు పక్షాలు అధికారికంగా వెల్లడించలేదు. కేంద్రం తీసుకువస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు ఎన్సీపీ (ఎస్‌పీ) కొన్ని షరతులతో కూడిన మద్దతు ఇవ్వొచ్చని వార్తలు వెలువడుతున్నాయి (NCP SP, NDA support).
ఈ నేపథ్యంలో మోదీ-పవార్ భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది (Maharashtra politics). అయితే పార్టీ ఎన్డీఏలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన ఏదీ లేదు. ఈ సమావేశం మర్యాదపూర్వక భేటీయా? లేక భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజకీయ వర్గాలు ఈ భేటీపై ఆసక్తిగా చర్చిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..