2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Jul 22 , 2026 | 07:17 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక వాణిజ్య నిర్ణయం ప్రకటించారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ మందులపై రెండేళ్ల పాటు సుంకాలేవీ ఉండబోవని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక వాణిజ్య నిర్ణయం ప్రకటించారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ (Generic) మందులపై రెండేళ్ల పాటు సుంకాలేవీ ఉండబోవని ప్రకటించారు. ఆ తర్వాత 2028 ఆగస్టు నుంచి 100 శాతం టారిఫ్ విధించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ టారిఫ్‌ను 200 శాతానికి పెంచుతామన్నారు (Trump generic drug tariff).
అమెరికాలో ఔషధ తయారీని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. జనరిక్ మందులను ఉత్పత్తి చేసే కంపెనీలు తొలి రెండేళ్లలో అమెరికాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఔషధాలను దేశీయంగానే ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ వెల్లడించారు (US generic drug tariff 2028).
అమెరికాకు జనరిక్ మందులను సరఫరా చేసే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి (India pharma exports). భారతీయ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్‌పై గణనీయంగా ఆధారపడుతున్నాయి. అందువల్ల 2028 నుంచి అమల్లోకి వచ్చే ఈ టారిఫ్‌లు భారత ఔషధ ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రెండేళ్ల గడువు ఇవ్వడంతో కంపెనీలు తమ ఉత్పత్తి, పెట్టుబడి వ్యూహాలను మార్చుకునేందుకు సమయం లభించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కృష్ణా జలాలపై నేటి నుంచి బ్రిజేశ్ ట్రైబ్యునల్ విచారణ