Heavy rains: 11 రోజులుగా నీళ్లలోనే.. తూత్తుకుడి శివారు ప్రాంత ప్రజల ఇక్కట్లు
ABN, Publish Date - Dec 29 , 2023 | 08:16 AM
తూత్తుకుడి వరద బాధిత ప్రాంతాల్లో నివారణ చర్యలు శరవేగంగా జరుగుతున్నా, 11వ రోజు కూడా పలు పల్లపు ప్రాంతాల్లో ప్రజలు నీటిలోనే గడుపుతున్నారు. శివారు ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. ఈ ప్రాంతంలో 1 నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచింది.
పెరంబూర్(చెన్నై): తూత్తుకుడి వరద బాధిత ప్రాంతాల్లో నివారణ చర్యలు శరవేగంగా జరుగుతున్నా, 11వ రోజు కూడా పలు పల్లపు ప్రాంతాల్లో ప్రజలు నీటిలోనే గడుపుతున్నారు. శివారు ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. ఈ ప్రాంతంలో 1 నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచింది. 143 భారీ మోటర్లతో నీరు తొలగించే పనులు 24 గంటలు కార్పొరేషన్ సిబ్బంది చేపడుతున్నారు. అలాగే, వరద నీరు వెళ్లేలా కాలువల్లో ఎక్స్‌కవేటర్లతో వ్యర్థాలు తొలగిస్తున్నారు. నీరు ఇంకా తగ్గకపోవడంతో పలు కుటుంబాలు వెలుపలి ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతుంగా, అపార్ట్‌మెంట్లలో ఉన్న వారు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
Updated Date - Dec 29 , 2023 | 08:16 AM