ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat : సముద్రంలో మునిగిపోతున్న ముగ్గుర్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2023-06-01T09:22:13+05:30

గుజరాత్‌లోని రాజుల నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ (BJP) నేత హీరా సోలంకి (Hira Solanki) ముగ్గురు యువకుల ప్రాణాలను కాపాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : గుజరాత్‌లోని రాజుల నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ (BJP) నేత హీరా సోలంకి (Hira Solanki) ముగ్గురు యువకుల ప్రాణాలను కాపాడారు. ఓ పడవలో వచ్చిన కొందరు వ్యక్తులు కూడా దీనికి సహకరించడంతో ముగ్గురు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బుధవారం పట్వా గ్రామం సమీపంలో జరిగింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, కల్పేష్ షియాల్, విజయ్ గుజారియా, నికుల్ గుజారియా, జీవన్ గుజారియా అనే నలుగురు యువకులు పట్వా గ్రామం సమీపంలోని సముద్రం వద్దకు బుధవారం వెళ్లారు. స్నానం చేయడం కోసం వీరు సముద్రంలో దిగారు. అదే సమయంలో ప్రవాహం తీవ్ర స్థాయిలో రావడం, పెద్ద గాలి వీయడంతో వీరంతా సముద్రంలోకి జారిపోయారు. తమను కాపాడాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. సముద్రం ఒడ్డున ఉన్న చాలా మంది దీనిని గమనించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి వెంటనే సముద్రంలోకి దూకి, కొట్టుకుపోతున్న నలుగురిలో ముగ్గుర్ని కాపాడగలిగారు. వీరిని ఓ పడవలోకి ఎక్కించి, ఒడ్డుకు చేర్చారు. అయితే జీవన్ గుజారియా మాత్రం వేగంగా సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఆయన మృతదేహం బుధవారం సాయంత్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది.

ఇవి కూడా చదవండి :

Chanchalguda Jail: చంచల్‌గూడ గేట్‌.. తాడేపల్లిలో రిమోట్‌

Minister: ఆ విషయంపై కేంద్రంతో మాట్లాడతాం.. త్వరలో ఢిల్లీకి వెళతా..

Updated Date - 2023-06-01T09:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising