ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

GST Collection: నవంబర్‌లో 1.67 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు.. 15 శాతం పెరిగిన వైనం

ABN, First Publish Date - 2023-12-01T19:36:29+05:30

వస్తు సేవల పన్ను వసూళ్లు నవంబర్‌ మాసంలో 15 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.60 లక్షల కోట్ల మార్క్‌ను దాటి జీఎస్‌టీ వసూళ్లు రావడం ఇది ఆరోసారి.

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు నవంబర్‌ మాసంలో 15 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మాసంలో వసూలైన రూ.1,67,929 కోట్ల మొత్తంలో సీజీఎస్‌టీ నుంచి రూ.30,420 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ నుంచి రూ.38,226 కోట్లు, ఐజీఎస్‌టీ నుంచి రూ.87,009 కోట్లు (సరకు దిగుమతి వసూళ్లు రూ.39,198 కోట్లతో కలిపి), సెస్ రూ.12,274 కోట్లు (సరుకు దిగుమతి వసూళ్లు రూ.1,036 కోట్లతో కలిపి) ఉన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.


''నవంబర్ నెలలో దేశవాళీ ట్రాన్సాక్షన్ల ద్వారా (దిగుమతి సేవలతో సహా) వసూలైన రెవెన్యూ గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 20 శాతం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.60 లక్షల కోట్ల మార్క్‌ను దాటి జీఎస్‌టీ వసూళ్లు రావడం ఇది ఆరోసారి'' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత అక్టోబర్‌లో జీఎస్‌టీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.1,72,003 కోట్లు వసూలైంది. ఏప్రిల్ 2023లో అత్యథికంగా రూ.1,87,035 కోట్లు వసూలయ్యాయి.

Updated Date - 2023-12-01T19:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising