ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India Vs America : అమెరికాను వెనుకకు నెట్టబోతున్న భారత్ : గోల్డ్‌మన్ శాచెస్

ABN, First Publish Date - 2023-07-11T09:57:54+05:30

భారత దేశ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండబోతోందని గోల్డ్‌మన్ శాచెస్ (Goldman Sachs) నివేదిక జోస్యం చెప్పింది. ఆర్థిక రంగంలో జపాన్, జర్మనీ, అమెరికాలను వెనుకకు నెట్టి భారత దేశం ఎదగబోతోందని తెలిపింది. 2075నాటికి ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఘనత సాధిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అనే విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండబోతోందని గోల్డ్‌మన్ శాచెస్ (Goldman Sachs) నివేదిక జోస్యం చెప్పింది. ఆర్థిక రంగంలో జపాన్, జర్మనీ, అమెరికాలను వెనుకకు నెట్టి భారత దేశం ఎదగబోతోందని తెలిపింది. 2075నాటికి ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఘనత సాధిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అనే విషయం తెలిసిందే.

మన దేశ జనాభా, నూతన ఆవిష్కరణలు (innovation), సాంకేతిక పరిజ్ఞానం, అత్యధిక మూల ధన పెట్టుబడులు, కార్మికుల ఉత్పాదకత పెరగడం వంటివాటి ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాచెస్ ఈ నివేదికను రూపొందించింది. రానున్న రెండు దశాబ్దాల్లో భారత దేశం ఇతర దేశాలపై ఆధారపడే నిష్పత్తి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలన్నిటిలోనూ అతి తక్కువగా ఉంటుందని తెలిపింది.

గోల్డ్‌మన్ శాచెస్ రీసెర్చ్‌కు చెందిన భారతదేశ ఆర్థికవేత్త శాంతను సేన్‌గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, నూతన ఆవిష్కరణలు, కార్మికుల ఉత్పాదకత పెరుగుతుండటం, మూలధన పెట్టుబడులు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి ముఖ్యమైన చోదకాలుగా దోహదపడుతున్నాయి. అదేవిధంగా జనాభా కూడా సానుకూలంగా ఉంది. అయితే జనాభా ఒక్కటే జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)కి చోదకం కాదు. ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు నూతన ఆవిష్కరణలు, కార్మికుల ఉత్పాదకత చాలా ముఖ్యమైనవి కాబోతున్నాయి. భారత దేశ పొదుపు రేటు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర దేశాలపై ఆధారపడే నిష్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఆదాయాలు పెరగడంతోపాటు ఆర్థిక రంగ అభివృద్ధి పెరుగుతుంది. వీటన్నిటివల్ల మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించి, మూలధనం అందుబాటులోకి రావచ్చు.

ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలపై దృష్టి సారించిందని ఈ నివేదిక తెలిపింది. మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు, విస్తృత స్థాయిలో కార్మిక శక్తిని రంగంలోకి దించేందుకు వీలుగా తయారీ (manufacturing), సేవా రంగాల్లో తమ సామర్థ్యాన్ని ప్రైవేటు రంగం పెంచుకోవడానికి ఇదే సరైన సమయమని తెలిపింది.

అయితే కార్మిక శక్తి భాగస్వామ్యం రేటు పెరగకపోవడం ఒక్కటే ప్రధాన ప్రతికూలత కాగలదని ఈ నివేదిక అంచనా వేసింది. భారత దేశంలో గడచిన 15 ఏళ్లలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు క్షీణించిందని తెలిపింది. లేబర్ ఫోర్స్‌లో పురుషుల కన్నా మహిళల భాగస్వామ్యం రేటు చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి :

Nadda : ప్రేమ దుకాణం కాదు.. ‘విద్వేష’ మెగా మాల్‌

Modi : రామేశ్వరం నుంచి మోదీ పోటీ?

Updated Date - 2023-07-11T09:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising