ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Earthquake: ఒకే రోజు రెండు భూకంపాలు.. వణికిన మణిపుర్ ప్రజలు

ABN, Publish Date - Dec 30 , 2023 | 09:14 AM

మణిపుర్‌(Manipur)ని శుక్రవారం రాత్రి భారీ భూకంపం(Earthquake) వణికించింది. దీంతో స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉఖ్రుల్ కు 280 కి.మీ.ల దూరంలో ఉన్న మయన్మార్‌(Myanmar)లో గత రాత్రి 10 గంటలకు 120 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

గ్యాంగ్‌టక్: మణిపుర్‌(Manipur)ని శుక్రవారం రాత్రి భారీ భూకంపం(Earthquake) వణికించింది. దీంతో స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉఖ్రుల్ కు 280 కి.మీ.ల దూరంలో ఉన్న మయన్మార్‌(Myanmar)లో గత రాత్రి 10 గంటలకు 120 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రత నమోదైంది. ఒకే రోజులో రెండు భూకంపాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మధ్యాహ్నం 1.47 నిమిషాలకు అస్సాంలోని డిబ్రూఘర్‌కు 226 కిలోమీటర్ల దూరంలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ విపత్తులో జరిగిన నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు. ఇందులో మణిపుర్ హై రిస్క్ జోన్ లో ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల మ్యాప్ ని అధికారులు విడుదల చేశారు. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితుల కారణంగా తరచూ ప్రకంపనలు వస్తు ఉంటాయని నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్‌లో ఉఖ్రుల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 30 , 2023 | 10:41 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising