Home » Manipur
జాతుల మధ్య ఘర్షణలతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, హిందూ సమాజం ధర్మానికి ప్రపంచ సంరక్షుడిగా ఉందన్నారు. భారత్ అంటే అమర నాగరికతకు పేరని చెప్పారు.
భద్రతాదళాలపై జరిగిన దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు వీర జవాన్లు మృతి చెందారని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నేపాల్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సుశీల కర్కిని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శనివారం ఉదయం అభినందించారు. పొరుగుదేశాలతో శాంతి, ప్రగతి, ప్రజల అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
చురాచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో మణిపూర్ అర్బన్ రోడ్లు, డ్రైనేజీలు, అస్సెట్ మేనేజిమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ప్రాజెక్టు, 5 నేషనల్ హైవే ప్రాజెక్టులు, మణిపూర్ ఇన్ఫోటెక్ డవలప్‌మెంట్ (MIND) ప్రాజెక్టు, తొమ్మిది ప్రాంతాల్లో వర్కింగ్ ఉమన్ హాస్టళ్లు ఉన్నాయి.
ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్‌లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ఆదివారం మధ్యాహ్నం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. గం. 14:16:20 కు 12 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు మార్గం సుగమం అయింది. ఇవాళ రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్షాల తీవ్ర నినాదాల మధ్య కేంద్ర హోంశాఖ..
అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఇంఫాల్‌లోని కావాకేథేల్, యురిపోక్‌లో రోడ్లపైకి వచ్చారు, టైర్లు, పాత సామగ్రికి నిప్పుపెట్టారు. దీంతో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
మణిపూర్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారని, ఆ కారణంగానే తాము గవర్నర్‌ను కలిసామని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపమ్ నిషికాంత సింగ్ తెలిపారు.
నిరసనకారులు ఇంఫాల్ వెస్ట్‌లోని లామ్మేల్‌పాట్‌లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయాలకు తాళాలు వేశారు. గవర్న్‌మెంట్ ఆఫ్ ఇండియా అనే పేరున్న సైన్‌బోర్డ్‌కు మసిపూశారు. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు.