Share News

మణిపుర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

ABN , Publish Date - Feb 03 , 2026 | 08:34 AM

ఎట్టకేలకు మణిపుర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సోమవారం కసరత్తు ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం సిద్ధమైంది.

మణిపుర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
Manipur political developments

ఎట్టకేలకు మణిపుర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సోమవారం కసరత్తు ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం సిద్ధమైంది. మణిపుర్ బీజేపీ ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో ఉన్నారని, వారు కొత్త నాయకుడిని ఎన్నుకుంటారని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి (Manipur government formation).


ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:00 గంటలకు మణిపుర్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఎమ్మెల్యేలు శాసనసభా పక్షనేతను ఎన్నుకోనున్నారు. మణిపుర్ సీఎం రేసులో గోవిందదాస్, విశ్వజిత్‌సింగ్ ఉన్నారు. వారిలో ఒకరిని ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిగా ఎన్నుకునే అవకాశం కనబడుతోంది. బుధవారం మణిపుర్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది (New government in Manipur).


60 మంది సభ్యులున్న మణిపుర్ అసెంబ్లీలో బీజేపీకి మెజారిటీ ఉంది (Manipur political developments). అయితే మెయితీలు, కుకీలు మధ్య మొదలైన జాతి హింస చాలా కాలం పాటు కొనసాగింది. దీంతో గతేడాది ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో సంక్షోభాన్ని తగ్గించడానికి కేంద్రం ఇరు సంఘాలతో చర్చలు జరిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ మణిపుర్ పర్యటనతో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.


ఇవి కూడా చదవండి..

హాస్పిటల్‌లో కాబోయే భర్త.. పెళ్లి కూతురి ఏడుపు.. పోలీసులు విచారణ చేస్తే..


దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 03 , 2026 | 09:14 AM