PM Modi On Sushila Karki: మహిళా సాధికారతకు పట్టం సుశీల కర్కి నియామకం.. మోదీ ప్రశంసలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:48 PM
నేపాల్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సుశీల కర్కిని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శనివారం ఉదయం అభినందించారు. పొరుగుదేశాలతో శాంతి, ప్రగతి, ప్రజల అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
చురాచంద్‌పూర్: నేపాల్ (Nepal) తొలి మహిళా ప్రధానమంత్రిగా నియమితులైన సుశీల కర్కి (Sushila Karki)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందనలు తెలిపారు. ఆమె నియామకం మహిళా సాధికారతకు ఒక ఉజ్వల ఉదాహరణ అని అన్నారు. నేపాల్ భారత్‌కు సన్నిహిత దేశమని, 140 కోట్ల భారత ప్రజానీకం తరఫున ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నానని మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మాట్లాడుతూ ప్రధాని అన్నారు.
'దేశ అత్యున్నత పదవిని కర్కి చేపట్టడం మహిళా సాధికారతకు బలమైన ఉదాహరణ. నేపాల్‌లో శాంతి, సుస్థిరత, అభ్యుదయానికి ఆమె పాటుపడతారని నేను బలంగా నమ్ముతున్నా' అని మోదీ అన్నారు. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం, భారీ నిరసనల నేపథ్యంలో కర్కి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా శుక్రవారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. అవినీతి నిరోధక కార్యకర్తగా, నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీల కర్కి పేరు తెచ్చుకున్నారు.
కాగా, నేపాల్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సుశీల కర్కిని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శనివారం ఉదయం అభినందించారు. పొరుగుదేశాలతో శాంతి, ప్రగతి, ప్రజల అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని
For More National News and Telugu News