ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi services bill : ఢిల్లీ సర్వీసెస్ బిల్లు వచ్చే వారం పార్లమెంటుకు

ABN, First Publish Date - 2023-07-28T12:56:38+05:30

అత్యంత వివాదాస్పదమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు వచ్చే వారం పార్లమెంటుకు రాబోతోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన ప్రయత్నాలు ఎంత వరకు సత్ఫలితాలిస్తాయో తేలిపోబోతోంది. ఈ బిల్లుకు మద్దతిస్తామని వైసీపీ ఇప్పటికే ప్రకటించగా, దీనిని వ్యతిరేకిస్తామని బీఆర్ఎస్ తెలిపింది.

Narendra Modi, Arvind Kejriwal

న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు వచ్చే వారం పార్లమెంటుకు రాబోతోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన ప్రయత్నాలు ఎంత వరకు సత్ఫలితాలిస్తాయో తేలిపోబోతోంది. ఈ బిల్లుకు మద్దతిస్తామని వైసీపీ ఇప్పటికే ప్రకటించగా, దీనిని వ్యతిరేకిస్తామని బీఆర్ఎస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి వీ మురళీధరన్ శుక్రవారం రాజ్యసభకు చెప్పారు.

ఢిల్లీ రాష్ట్రంలోని అధికారుల నియామకాలు, బదిలీలపై అధికారాన్ని ప్రత్యేక అథారిటీకి కల్పించేందుకు ఓ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి మే నెలలో జారీ చేశారు. దీనికి బదులుగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా 26 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి (I.N.D.I.A) ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లును తేవడమంటే భారత దేశ సమాఖ్య నిర్మాణంపై దాడిచేయడమేనని ఆరోపించింది.


The Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023కు పార్లమెంటు ఆమోదం లభిస్తే, ఢిల్లీ రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును తోసిపుచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే, కేంద్ర ప్రభుత్వ అధికారాల పునరుద్ధరణ జరుగుతుంది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు మద్దతివ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.

ఈ బిల్లు ఆమోదం పొంది, చట్టంగా అమలైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు మరింత బలోపేతమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో లెఫ్టినెంట్ గవర్న్ విభేదించవచ్చు.

ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.


ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్ వీడియో లీకేజ్ వెనుక కుట్ర : అమిత్ షా

Congress Vs BJP : మహాభారతంలో ‘లవ్ జీహాద్’ ఉందన్న కాంగ్రెస్ నేత.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిమంత బిశ్వ శర్మ..

Updated Date - 2023-07-28T12:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising