ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chhattisgarh: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు? ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీదే ఆధిక్యం!

ABN, First Publish Date - 2023-12-03T14:45:03+05:30

ప్రస్తుతం వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (BJP) ఆధిక్యత కనబరుస్తోంది. తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలకు ముందు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు మిగతా రాష్ట్రాల్లో నిజమవుతున్నప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) మాత్రం తారుమారయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ (Congress) గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే అక్కడ కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ కనబరుస్తోంది (Election Results).

ఛత్తీస్‌గ‌ఢ్‌లో మొత్తం 90 శాశన సభ స్థానాలకు గానూ బీజేపీ ప్రస్తుతం 55 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 34, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 46 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. 2018లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 71, బీజేపీ 14 సీట్లను గెలుచుకున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తారమారు చేస్తూ బీజేపీ విజయకేతనం ఎగరవేయబోతోంది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కమలం హవా.. ప్రియాంక ``హైట్`` వ్యాఖ్యపై సింధియా కౌంటర్!

Updated Date - 2023-12-03T14:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising