ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై.. 8న సమర శంఖారావం

ABN, First Publish Date - 2023-10-06T12:29:49+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు(Telugu Desam Party National President Chandrababu Naidu) అరెస్టును

- బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిరసన

- హాజరు కానున్న ఏపీ అగ్ర నేతలు

- 20మంది పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఇన్‌చార్జిలు

- మారతహళ్ళిలో జోరందుకున్న ఏర్పాట్లు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు(Telugu Desam Party National President Chandrababu Naidu) అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న పోరాటాలకు భారీగా స్పందన లభిస్తోంది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాలలోను అభిమానులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభిమానులు బెంగళూరులో నిరంతరంగా వేలాది మందితో పోరాటాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో పోరాటాలలో పాల్గొనడం ద్వారా మరింత చైతన్యం తీసుకువచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు, పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఇన్‌ఛార్జ్‌లు తరలిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం మధ్యాహ్నం ఎస్‌బీఆర్‌ ప్యాలెస్‌ మారతహళ్ళిలో బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం సమరశంఖారావం పేరిట సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8దాకా జరిగే సభకు వేలాది మంది ప్రవాసాంధ్రులు, తెలుగు అభిమానులు, ఎన్‌టీఆర్‌, చంద్రబాబు అభిమానులు పాల్గొననున్నారు.

సమరశంఖారావంకు పొలిటి బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి కొల్లురవీంధ్ర, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కాలువ శ్రీనివాసులు, దెందలూరు పార్టీ ఇన్‌ఛార్జ్‌ చింతమనేని ప్రభాకర్‌, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బీసీ జనార్ధనరెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి నన్నూరి నర్శిరెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, వినుకొండ ఇన్‌ఛార్జ్‌ యరపతినేని శ్రీనివాసరావ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి, ధర్మవరం ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరాం, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌, యార్లగడ్డ వెంకటేశ్వరరావ్‌, ఐటీడీపీ ఇన్‌ఛార్జ్‌ చింతకాయల విజయ్‌, పీ. తేజస్వీని, జాతీయ ఉపాధ్యక్షుడు మాధవనాయుడు, విజయనగర్‌ జిల్లా ఇన్‌ఛార్జ్‌ కిమిడి నాగార్జునలు పాల్గొననున్నారు. బెంగళూరు నగరంతో పాటు అనుబంధ జిల్లాలు, బళ్ళారి, రాయచూరు, కొప్పళ జిల్లాలకు చెందిన అభిమానులను టీడీపీ ఫోరం ఆహ్వానిస్తోంది.

Updated Date - 2023-10-06T12:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising