Hema Malini: బీజేపీ ఎంపీ హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-03-14T23:06:33+05:30
సినీ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని(BJP MP Hema Malini ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Hema Malini
మథుర: సినీ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని(BJP MP Hema Malini ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహం తర్వాత మహిళల కెరీర్ ఆగిపోదని, తాను కూడా ఆగలేదని, నిరంతరాయంగా పనిచేస్తున్నానని చెప్పారు. తనను చాలామంది ఆదర్శంగా తీసుకుంటున్నారని కూడా తెలిపారు. మథుర(Mathura) ఎంపీగా యమునా(Yamuna) నది పరిశుభ్రంగా ఉండాలనేది తన అభిమతమన్నారు. ఢిల్లీ(Delhi) నుంచి మథురకు చేరేసరికి యమునా నది నీళ్లు మురికిగా మారుతున్నాయని, నది ప్రక్షాళనకు కృషి చేస్తున్నామని చెప్పారు. అయితే దీనికి మరికొంత సమయం పడుతుందని హేమామాలిని చెప్పారు.
Updated Date - 2023-03-14T23:06:36+05:30 IST