ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి రూ.100 కోట్ల రిజిస్ట్రేషన్‌ రద్దు

ABN, First Publish Date - 2023-07-21T11:15:20+05:30

రామనాథపురం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తిరునల్వేలి బీజేపీ ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌(BJP MLA Nainar Nagendran) కుమారుడు బాలాజీ, ఇళ

ప్యారీస్‌(చెన్నై): రామనాథపురం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తిరునల్వేలి బీజేపీ ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌(BJP MLA Nainar Nagendran) కుమారుడు బాలాజీ, ఇళయరాజా అనే ఓ వ్యక్తి మరికొందరు నకిలీ పత్రాలతో విరుగంబాక్కంలో రూ.100 కోట్లకు కొనుగోలు చేసిన స్థలం రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ శాఖ(Registration Department) రద్దు చేసింది. ఈ నకిలీ దస్తావేజులతో రిజిస్ట్రేషన్‌ చేయడానికి వారికి రామానాధపురం సబ్‌ రిజిస్ట్రార్‌ సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. చెన్నై విరుగంబాక్కంలో మదురై మీనాక్షి(Madurai Meenakshi) అమ్మవారి ఆలయానికి చెందిన 1.3 ఎకరాల స్థలం వివాదంలో ఉంది. ఆ స్థలం యజమానులు తామేనంటూ పలువురు చెప్పడంతో వివాదం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో రూ.100 కోట్ల విలువైన ఆ స్థలాన్ని రూ.46 కోట్లకు బేరమాడినట్లు నయినార్‌ బాలాజీ తదితరులు నకిలీ ఒప్పంద పత్రాలు స్పష్టించి, అడ్వాన్స్‌గా రూ.2.50 కోట్ల చెల్లించినట్లు మరో రికార్డు కూడా తయారు చేసిన భారీ స్థాయిలో మోసానికి పాల్పడినట్లు అరప్పోర్‌ ఇయక్కమ్‌ అనే సంస్థ ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి, చెన్నై పోలీస్‌ కమిషనర్లకు వినతిపత్రాలు సమర్పించారు. వాటిపై తిరునల్వేలి(Tirunalveli) మండల రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు జరిపిన విచారణలో నయినార్‌ బాలాజీ, ఇళయరాజా తదితరులు స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం సమర్పించిన దస్తావేజులు నకిలీవని గుర్తించారు. దీంతో ఆ రిజిస్ట్రేషన్‌ పూర్తిగా రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మోసపు రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన నయినార్‌ బాలాజీ, ఇళయరాజా తదితరులపై కఠిన చర్యలు చేపడతామని కూడా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2023-07-21T11:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising