ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mamata Banerjee: బీజేపీ ఆటకట్టు... పంచాయతీ ఎన్నికల ప్రచార బరిలో దీదీ

ABN, First Publish Date - 2023-06-26T17:04:20+05:30

దేశాన్ని అమ్మేయాలని బీజేపీ కోరుకుంటోందని, వాళ్ల డబుల్ ఇంజన్లు త్వరలోనే అదృశ్యం ) కానున్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూచ్‌బెహర్: దేశాన్ని అమ్మేయాలని బీజేపీ (BJP) కోరుకుంటోందని, వాళ్ల డబుల్ ఇంజన్లు (Double engines) త్వరలోనే అదృశ్యం (Vanish) కానున్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamamta Banerjee) అన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఇంజన్‌ను బీజేపీ కోల్పోనుందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండో ఇంజన్ కూడా మాయమవుతుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి (Maha Jota) ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని మమతా బెనర్జీ చెప్పారు.

సరిహద్దు ప్రాంతాల్లో ఓటర్లను బెదిరిస్తున్న బీఎస్ఎఫ్..!

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)పై మమతా బెనర్జీ సంచలన ఆరోపణ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పర్యటించి అక్కడి వారిని ఓటు వేయవద్దంటూ బెదరిస్తున్నట్టు తనకు సమచారం అందిందని చెప్పారు. ప్రజలు నిర్బయంగా ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలు అనేవి రాష్ట్రానికి సంబంధించిన అంశమని, అందులో కేంద్రం పాత్ర ఏమీ ఉండదని కూడా మమత గుర్తుచేశారు.

మమత ప్రచారంపై కాంగ్రెస్ విసుర్లు

కాగా, పంచాయతీ ఎన్నికల కోసం 12 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ ప్రచారానికి దిగడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. టీఎంసీ పార్టీ బలహీనతకు ఇది అద్దం పడుతోందని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి అన్నారు. తాను ప్రచారంలోకి రాకుంటే ఏమి జరుగుతుందో మమతా బెనర్జీకి తెలుసునని, అందుకే ఆమె స్వయంగా ప్రచారంలోకి దిగారని పేర్కొన్నారు.

టీఎంసీ ఘాటు సమాధానం

మమతా బెనర్జీ స్వయంగా పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దిగడంపై విపక్షాల విమర్శలను టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ కొట్టివేశారు. మమతా బెనర్జీ పార్టీకి కట్టుబడిన నాయకురాలని, పంచాయతీ ఎన్నికల్లో కొన్ని సమావేశాల్లోనైనా మమతాబెనర్జీ మాట్లాడాలని పార్టీ కోరుకుందని, దీంతో ఆమె ప్రచార బరిలోకి దిగారని, బీజేపీ బలం చూసి కాదని అన్నారు.

పశ్చిమబెంగాల్‌లో మూడంచెల పంచాయతీ ఎన్నికలు జూలై 8న ఒకే దశలో జరగనున్నాయి. ఈ ఎన్నికలను టీఎంసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా, బీజేపీ సైతం నామినేషన్ల పర్వంలో చెలరేగిన హింసపై ఫిర్యాదు చేయడం ద్వారా రాష్ట్రంలో అల్లర్లు జరిగేందుకు అవకాశమున్న జిల్లాల్లో కేంద్ర బలగాల మోహరింపునకు మార్గం సుగమం చేసింది. టీఎంసీపై పట్టుబిగించే ప్రయత్నాలు చేస్తోంది.

Updated Date - 2023-06-26T17:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising