ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Opposition unity: కేజ్రీవాల్‌ను కలిసిన నితీష్‌కుమార్

ABN, First Publish Date - 2023-05-21T14:19:17+05:30

న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో 'విపక్ష ఐక్య కూటమి' ఏర్పాటుకు జరుపుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, 'ఆప్' కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కుమార్ ఆదివారంనాడు ఆయన నివాసంలో కలుసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో 'విపక్ష ఐక్య కూటమి' ఏర్పాటుకు జరుపుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, 'ఆప్' కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కుమార్ (Nitish Kumar) ఆదివారంనాడు ఆయన నివాసంలో కలుసుకున్నారు. కేజ్రీవాల్‌తో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, పార్టీ నేతలు సంజయ్ ఝా, మనోజ్ ఝా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆప్ సర్కార్ అధికారాలకు కేంద్రం గండికొడుతోందంటూ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తు్న్న నేపథ్యంలో ఆయనను నితీష్ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేజ్రీవాల్‌కు అండగా ఉంటాం: నితీష్

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను కేంద్రం ఊడలాక్కోవడం రాజ్యాంగవిరుద్ధమని, ఈ విషయంలో కేజ్రీవాల్ తాము అండగా నిలుస్తామని సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ నితీష్ కుమార్ తెలిపారు. దేశంలోని అన్ని విపక్ష పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే, ఢిల్లీలోని గ్రూప్-ఏ అధికారుల నియామకం, బదిలీలపై సుప్రీం తీర్పునకు విరుద్ధంగా కేంద్రం ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవచ్చని అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఈనెల 23న కలుస్తామని చెప్పారు. నితీష్‌తో సహా కేజ్రీవాల్‌ను కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ చర్య (ఆర్డినెన్స్ తేవడం) ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తాము ముందుకు సాగనీయమని చెప్పారు.

ఆర్డినెన్స్‌ను బిల్లుగా తెస్తే...

ఢిల్లీ ప్రజలకు అండగా నిలుస్తామని నితీష్ కుమార్ భరోసా ఇచ్చినట్టు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అధికారుల బదిలీ, నియామకాలపై సర్వాధికారాలను రాష్ట్రానికి కట్టబెడుతూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, అయితే ఆ తీర్పుకు విరుద్ధంగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని, ఈ ఆర్డినెన్స్‌ను బిల్లుగా కేంద్రం తీసుకువస్తే బీజేపీయేతర పార్టీలన్నీ కలిసికట్టుగా రాజ్యసభలో ఓడించాలని అన్నారు. అలా చేయడం ద్వారా 2024 ఎన్నికల్లో బీజేపీకి ఉద్వాసన తప్పదనే సందేశం ఇచ్చినట్టవుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-21T14:19:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising