ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pathaan Row: షారుఖ్ ఎవరు? ప్రశ్నించిన సీఎం

ABN, First Publish Date - 2023-01-21T20:13:16+05:30

''షారూక్ ఖాన్ ఎవరు? ఆయన ఎవరో నాకు తెలియదు''. ఈ మాట ఎవరైనా అంటే ఆశ్చర్యపోనవసరం లేదు కానీ, సాక్షాత్తూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌహతి: ''షారూక్ ఖాన్ (Sharukh Khan) ఎవరు? ఆయన ఎవరో నాకు తెలియదు''. ఈ మాట ఎవరైనా అంటే ఆశ్చర్యపోనవసరం లేదు కానీ, సాక్షాత్తూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) నోట వెంట వచ్చిన మాట ఇది. అసలు విషయానికి వస్తే... బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ నటించిన 'పఠాన్' (Pathan) చిత్రం విడుదలకు ముందే వివాదానికి దారితీసింది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి పలు హిందూ సంస్థలు కన్నెర్ర చేశాయి. ప్రధానంగా కాషాయం బికినీ ధరించి 'బేషరమ్ రంగ్' అనే పాటలో దీపికా పదుకొనే ప్రదర్శించిన భంగిమలపై గుర్రుమన్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌ దళ్ డిమాండ్లు అంతకంతకూ ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అసోంలోని నరెంగి సిటీలోని ఒక థియేటర్‌లో ఈనెల 25న ప్రదర్శనకు సిద్ధమవుతున్న 'పఠాన్'కు నిరసనగా బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు శుక్రవారం నానా హంగామా చేశారు. పోస్టర్లు చించేసి వాటిని తగులబెట్టారు. దీనిపై ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మను మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన అంతే వేగంగా స్పందించారు.

''షారూఖ్ ఖాన్ ఎవరు? ఆయన గురించి కానీ, పఠాన్ సినిమా గురించి కానీ నాకు తెలియదు'' అని సీఎం సమాధానమిచ్చారు. సమస్య గురించి బాలీవుడ్‌కు చెందిన చాలా మంది ఫోన్ చేశారు కానీ, మీరు చెబుతున్న ఖాన్ మాత్రం ఫోన్ చేయలేదు. ఒకవేళ చేస్తే అప్పుడు ఆలోచిస్తానని అన్నారు. ఖాన్ ఎవరో కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అని మళ్లీ విలేఖరులు చెప్పడంతో....''ఇలా చూడండి. అసోం ప్రజలు అస్సామీ సినిమాల కోసం చూస్తున్నారు. హిందీ సినిమాల కోసం కాదు. అస్సామీలో దివంగత నిపోన్ గోస్వామి తొలిసారి దర్శకత్వం వహించిన ''డాక్టర్ బెజ్‌బారువా- పార్ట్2' త్వరలో విడుదల కానుంది. దాని కోసం ఇక్కడ జనం ఎదురుచూస్తున్నారు'' అని సీఎం సమాధానమిచ్చారు.

Updated Date - 2023-01-21T20:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising