ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah: ఐపీసీని వేరే చట్టాలతో భర్తీ చేయాల్సిందే, ఏ చట్టానికైనా కాలపరిమితి 50 ఏళ్లే..!

ABN, First Publish Date - 2023-10-07T21:01:26+05:30

ఐపీసీ, సీఅర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో మార్పు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు. నేరాల స్థాయిలో మార్పుల దృష్ట్యా ఏ చట్టానికైనా 50 ఏళ్ల తర్వాత గడువు తీరిపోతుందని అన్నారు.

డెహ్రాడూన్: ఐపీసీ (IPC), సీఅర్‌పీసీ (CRPC), ఎవిడెన్స్ చట్టాల (Indian Evidence Act)ను వేరే కొత్త చట్టాలతో మార్పు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు. నేరాల స్థాయిలో మార్పుల దృష్ట్యా ఏ చట్టానికైనా 50 ఏళ్ల తర్వాత గడువు తీరిపోతుందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనే పద్ధతులు కూడా మారాల్సి ఉంటుందని చెప్పారు. శనివారంనాడిక్కడ జరిగిన 49వ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్‌లో అమిత్‌షా మాట్లాడుతూ, 1860 నుంచి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు.


ఐపీసీకి బదులుగా భారతీయ న్యాయ సంహిత, సీఆర్‌పీఎఫ్ స్థానే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఎవిడెన్స్ యాక్ట్‌ను భారతీయ సాక్షగా మార్చే విషయం పార్లమెంటరీ ప్యానల్ పరిశీలనలో ఉందని అమిత్‌షా చెప్పారు. పార్లమెంటులో ఆమోదం పొందగానే మూడు పాత కోడ్‌‍ల స్థానే కొత్త కోడ్‌ తీసుకువస్తామని అన్నారు. కేసుల సత్వర పరిష్కరానికి, ఎలాంటి జాప్యం జరక్కుండా చూడడానికి ఈ చట్టాలు ఉపకరిస్తాయని చెప్పారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ సైన్స్ ప్రధానంగా 5జి యుగంలో పోలిసింగ్, నార్కోటిక్స్, సోషల్ మీడియా సవాళ్లు, కమ్యూనిటీ పోలిసింగ్, అంతర్గత భద్రత, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మధ్య సమన్వయం వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తోందన్నారు. దేశ అంతర్గత భద్రత, శాంతి భద్రతలు, సరిహద్దు భద్రత వంటివి కూడా ప్రధాన చర్చనీయాంశాలని చెప్పారు.

Updated Date - 2023-10-07T21:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising