ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MCD Ruckus: ప్రమాణ స్వీకారం ఎవరు ముందు చేయాలో తేల్చేశారు!

ABN, First Publish Date - 2023-01-23T17:08:02+05:30

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌(MCD)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌(MCD)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎవరు ముందు ప్రమాణ స్వీకారం చేయాలన్న విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. మంగళవారం (24న) జరగనున్న ఎంసీడీ సమావేశంలో తొలుత ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత నామినేటెడ్ సభ్యులు చేస్తారు. ఈ నెల 6న జరిగిన సమావేశంలో ఎవరు ముందు ప్రమాణ స్వీకారం చేయాలనే విషయంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP) సభ్యులు సభలో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.

మేయర్(Mayor), డిప్యూటీ మేయర్(Deputy Mayor) ఎన్నికపై సభ్యులు మంగళవారం మరోమారు సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎంసీడీ సభ్యుల తొలి సమావేశం తీవ్ర గందరగోళం మధ్య వాయిదా పడింది. తొలుత 10 మంది నామినేటెడ్ సభ్యులు (అందరూ బీజేపీ వారే) ప్రమాణ స్వీకారం చేయడం వివాదానికి కారణమైంది. దీంతో సమావేశం వాయిదా పడింది.

ఎంసీడీ సమావేశం ఎజెండా ప్రకారం.. తొలుత ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ తర్వాత నామినేటెడ్ సభ్యులు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈ సమావేశంలోనే ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీని కూడా ఎన్నుకుంటారు.

ఇటీవల జరిగిన ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, నామినేటెడ్ సభ్యులతో ఓటు వేయించడం ద్వారా ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) భావిస్తోందని ‘ఆప్’ భావించి నిరసనలకు దిగింది. దీంతో మేయర్ ఎన్నిక నిలిచిపోయింది.

ఎంసీడీ ఎన్నికల్లో మొత్తం 250 మంది ఎన్నికైన కౌన్సిలర్లు ఉన్నారు. వీరు కాకుండా బీజేపీకి ఢిల్లీ నుంచి ఏడుగురు లోక్‌సభ సభ్యులు, ఆప్‌‌కు ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఢిల్లీ స్పీకర్ నామినేట్ చేసిన 14 మంది ఎమ్మెల్యేలు మేయర్ ఎన్నికల్లో పాల్గొంటారు. నిజానికి నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి వీల్లేదు.

ఢిల్లీ మేయర్ పదవి రొటేషన్ పద్ధతిలో కొనసాగుతుంది. మొదటి ఏడాది మహిళకు రిజర్వు చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీకి, మూడో ఏడాది రిజర్వు కేటగిరీకి, ఆ తర్వాత రెండేళ్లు ఓపెన్ కేటగిరీకి కేటాయించారు.

Updated Date - 2023-01-23T17:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising