ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi liquor scam: ఆప్ నేత సంజయ్ సింగ్ అనుచరుల ఇళ్లపై ఈడీ దాడి

ABN, First Publish Date - 2023-05-24T11:29:52+05:30

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ సహాయకుల కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం దాడులు జరిపింది....

AAP MP Sanjay Singh says ED raided
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ సహాయకుల కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం దాడులు జరిపింది.ఢిల్లీలోని విఠల్ భాయ్ పటేల్ హౌస్‌లోని సర్వేష్ మిశ్రా ఆవరణలో ఈడీ దాడులు నిర్వహించిందని సంజయ్ సింగ్ ట్వీట్ లో ఆరోపించారు.(AAP MP Sanjay Singh)ఆప్ నాయకుడు అజిత్ త్యాగి ప్రాంగణంలో ఈడీ దాడి చేసిందని కూడా ఆయన తెలిపారు.(Delhi liquor scam)ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి :

తాజా సమాచారం ప్రకారం మద్యం కుంభకోణంలో ఢిల్లీలోని ఆరు చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.(ED raided) అజిత్ త్యాగి, సర్వేష్ మిశ్రా, పునీత్ త్యాగి, అమిత్ గోయల్ నివాసాల్లో సోదాలు జరిగాయి.గుర్గావ్‌లోని బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా,వ్యాపారవేత్త దినేష్ అరోరా సిసోడియాకు సన్నిహిత సహచరులని సీబీఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రద్దు చేసినప్పటి నుంచి చాలా మంది సీనియర్ ఆప్ నాయకులు, వారి సన్నిహితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,సీబీఐ దాడులు చేస్తోంది.డిప్యూటీ సీఎం ఇంటితోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి.

Updated Date - 2023-05-24T11:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising