ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament Suspensions: మరో 49 మంది ఎంపీలపై వేటు.. రికార్డు స్థాయిలో 141 మందిపై సస్పెన్షన్!

ABN, Publish Date - Dec 19 , 2023 | 01:29 PM

గత వారం లోక్‌సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. గతవారం ఇద్దరు దుండగులు లోక్‌సభ ఛాంబర్‌లోకి ప్రవేశించి భయాందోళనలు కలిగించిన సంగతి తెలిసిందే. ఆ భద్రతా వైఫల్యంపై హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

గత వారం లోక్‌సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన (Security Breach) పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. గతవారం ఇద్దరు దుండగులు లోక్‌సభ ఛాంబర్‌లోకి ప్రవేశించి భయాందోళనలు కలిగించిన సంగతి తెలిసిందే. ఆ భద్రతా వైఫల్యంపై హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఈ రోజు (మంగళవారం) కూడా ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వకపోవడంతో ఏకంగా 49 మందిని స్పీకర్ సస్పెండ్ చేశారు (MPs Suspension).

ఈ శీతాకాల సమవేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తాజా వేటుతో కలిపి ఈ సెషన్‌లో సస్పెండ్ అయిన మొత్తం ఎంపీల సంఖ్య 141కి చేరుకుంది. పార్లమెంట్ చరిత్రలో ఒకేసారి ఇంత మంది సభ్యులు ఎప్పుడూ సస్పెండ్ కాలేదు. తాజాగా సస్పెండ్ అయిన ఎంపీల్లో ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, కార్తీ చిదంబరం, సుప్రియా సూలే, డింపుల్ యాదవ్‌, మనీశ్ తివారి తదితరులు ఉన్నారు. సభలో భద్రతకు సంబంధించిన ఏదైనా సంఘటన సచివాలయం పరిధిలోకి వస్తుందని, కేంద్ర జోక్యం ఉండదని గత వారం లోక్‌సభ స్పీకర్ స్పష్టం చేశారు.

Updated Date - Dec 19 , 2023 | 01:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising