ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China Vs America : భారత్-చైనా సరిహద్దు విషయంలో చైనాకు షాక్ ఇచ్చిన అమెరికా

ABN, First Publish Date - 2023-03-15T16:35:42+05:30

ఇతర దేశాలను ఆక్రమించుకోవాలనే దురాశగల చైనాకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్

China-India
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వాషింగ్టన్ : ఇతర దేశాలను ఆక్రమించుకోవాలనే దురాశగల చైనాకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారత దేశంలో అంతర్భాగమని, అరుణాచల్ ప్రదేశ్-చైనా మధ్య సరిహద్దుగా మెక్‌మెహన్ రేఖ (McMahon Line)ను గుర్తిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు సెనేట్‌లో ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ తీర్మానాన్ని సెనేటర్ బిల్ హాగెర్టీ, సెనేటర్ జెఫ్ మెర్క్‌లీ ప్రతిపాదించారు. బిల్ మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్‌కు చైనా బాహాటంగా తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నపుడు, ఆ ప్రాంతంలోని తన వ్యూహాత్మక భాగస్వాములతో అమెరికా భుజం భుజం కలిపి నిలవవలసిన అవసరం ఉందన్నారు. మరీ ముఖ్యంగా భారత దేశంతో కలిసి పని చేయవలసిన అవసరం ఉందన్నారు. భారత దేశంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతర్భాగమని నిర్ద్వంద్వంగా గుర్తించేందుకు సెనేట్ మద్దతును ఈ బైపార్టిజాన్ తీర్మానం వెల్లడిస్తోందన్నారు. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైన్యం దురాక్రమణ బుద్ధితో చేస్తున్న ప్రయత్నాలను ఈ తీర్మానం ఖండిస్తోందన్నారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని చెప్తోందన్నారు. అదే విధంగా స్వేచ్ఛాయుత, అరమరికలు లేని ఇండో-పసిఫిక్ కోసం క్వాడ్‌ (QUAD)కు మద్దతిస్తోందన్నారు.

సెనేట్‌లోని ఇరు పార్టీలు ఈ తీర్మానాన్ని బలపరచి, ఆమోదించాయి. చైనా-భారత దేశంలోని రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా మెక్‌మెహన్ రేఖను అమెరికా గుర్తిస్తోందని ఈ తీర్మానం పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చైనా చేస్తున్న వాదనను ఈ తీర్మానం తోసిపుచ్చింది.

QUAD అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్. ఈ గ్రూపులో భారత దేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

Congress : భారత్‌కు తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ... పార్లమెంటుకు వెళ్తారా?...

Excise Policy : మద్యం విధానంపై కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

Updated Date - 2023-03-15T18:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising